భారత డ్రెస్సింగ్‌ రూమ్‌లో విభేదాలు.. క్లారిటీ ఇచ్చిన గౌతం గంభీర్‌ | Gautam Gambhir Breaks Silence On Dressing Room Leaks | Sakshi
Sakshi News home page

IND vs AUS: భారత డ్రెస్సింగ్‌ రూమ్‌లో విభేదాలు.. క్లారిటీ ఇచ్చిన గంభీర్‌

Jan 2 2025 10:53 AM | Updated on Jan 2 2025 12:10 PM

Gautam Gambhir Breaks Silence On Dressing Room Leaks

బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీ 2024-25 తుది అంకానికి చేరుకుంది. ఈ సిరీస్‌లో భాగంగా భార‌త్‌-ఆస్ట్రేలియా మ‌ధ్య‌ ఆఖ‌రి టెస్టు జ‌న‌వ‌రి 3 నుంచి సిడ్నీ వేదిక‌గా ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్‌ను 3-1 సొంతం చేసుకోవాల‌ని ఆతిథ్య ఆసీస్ భావిస్తుంటే.. మ‌రోవైపు సిడ్నీలో ప్ర‌త్య‌ర్ధిని ఓడించి సిరీస్‌ను డ్రా చేయాల‌ని భార‌త్ ప‌ట్టుద‌లతో ఉంది.

అందుకు తగ్గ‌ట్టే భార‌త జ‌ట్టు నెట్స్‌లో తీవ్రంగా శ్ర‌మిస్తోంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే భార‌త్ త‌మ డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్ ఆశ‌ల‌ను స‌జీవంగా ఉంచుకుంటుంది. ఈ క్ర‌మంలో భార‌త తుది జ‌ట్టులో ప‌లు మార్పులు చోటు చేసుకోనున్న‌ట్లు తెలుస్తోంది. మ‌రోవైపు ఈ సిరీస్‌లో భార‌త జ‌ట్టు ప్ర‌ద‌ర్శ‌న ప‌ట్ల హెడ్‌కోచ్ గౌతం గంభీర్ సీరియ‌స్‌గా ఉన్న‌ట్లు స‌మాచారం. 

ఇకపై జట్టు అవసరాలకు తగ్గట్లు ఆడకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని గౌతీ హెచ్చరించిన‌ట్లు వినికిడి. ఈ క్ర‌మంలో టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ వాత‌వార‌ణం వేడెక్కిందని, సెల‌క్ష‌న్ క‌మిటీ, కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌తో గంభీర్‌కు విభేదాలు త‌లెత్తిన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. తాజాగా వీటిపై  గౌతం గంభీర్ క్లారిటీ ఇచ్చాడు. డ్రెస్సింగ్ రూమ్‌లో ఎటువంటి గొడ‌వ‌లు జ‌ర‌గ‌డం లేద‌ని, అవ‌న్నీ రూమ‌ర్సే అని గౌతీ కొట్టి పారేశాడు.

"డ్రెస్సింగ్ రూమ్‌లో కోచ్, ఆట‌గాళ్ల మ‌ధ్య చాలా చర్చ‌లు జ‌రుగుతాయి. అవి అక్క‌డి వ‌ర‌కే ప‌రిమితం కావాలన్న‌ది నా అభిప్రాయం. డ్రెసింగ్ రూమ్ వాత‌వార‌ణం చాలా ప్ర‌శాంతంగా ఉంది. ఎటువంటి విభేదాలు.

బ‌య‌ట వినిపిస్తున్న వార్త‌ల‌న్నీ అవాస్త‌వం. వీటిపై స్పందించాల్సిన అవసరం లేదు. మనం నిజాయితీగా ఉన్నామా లేదన్నది ముఖ్యం. నిజాయ‌తీ క‌లిగిన వ్య‌క్తులు డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్నంత వ‌ర‌కుభారత క్రికెట్ సురక్షితంగానే ఉంటుంది.

డ్రెసింగ్ రూమ్‌లో ఆట‌గాళ్ల ప్ర‌ద‌ర్శ‌న, మ్యాచ్‌లు ఎలా గెల‌వాల‌న్న విష‌యాల గురించే చ‌ర్చిస్తాము. విరాట్‌ కోహ్లితో కూడా ప్రత్యేకంగా ఎటువంటి చర్చలు జరపలేదు. ప్రస్తుతం మా దృష్టింతా సిడ్నీ టెస్టుపైనే ఉందని" ప్రీమ్యాచ్‌ కాన్ఫరెన్స్‌లో గంభీర్‌ పేర్కొన్నాడు.
చదవండి: IND vs AUS 5th Test: టీమిండియాకు భారీ షాక్‌.. స్టార్ ప్లేయ‌ర్‌కు గాయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement