అన్‌మోల్‌కు తొలి అంతర్జాతీయ టైటిల్‌ | First International Title for Anmo | Sakshi
Sakshi News home page

అన్‌మోల్‌కు తొలి అంతర్జాతీయ టైటిల్‌

Sep 15 2024 4:12 AM | Updated on Sep 15 2024 4:12 AM

First International Title for Anmo

భారత బ్యాడ్మింటన్‌ రైజింగ్‌ స్టార్‌ అన్‌మోల్‌ ఖరబ్‌ తన కెరీర్‌లో తొలి అంతర్జాతీయ టైటిల్‌ను సాధించింది. శనివారం ముగిసిన బెల్జియం ఓపెన్‌ ఇంటర్నేషనల్‌ చాలెంజ్‌ టోర్నీలో హరియాణాకు చెందిన 17 ఏళ్ల అన్‌మోల్‌ మహిళల సింగిల్స్‌ విభాగంలో చాంపియన్‌గా అవతరించింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 222వ స్థానంలో ఉన్న అన్‌మోల్‌ 59 నిమిషాలపాటు జరిగిన  ఫైనల్లో 24–22, 12–21, 21–10తో ఏడో సీడ్‌ అమెలీ షుల్జ్‌ (డెన్మార్క్‌)పై గెలిచింది.

Advertisement
 
Advertisement
Advertisement