చివ‌రి నిమిషంలో గోల్‌.. ఉత్కంఠ పోరులో ఐవ‌రీ కోస్ట్ విజ‌యం | FIFA WC 2026: Ivory Coast Stuns Ecuador Ends-19 game Unbeaten | Sakshi
Sakshi News home page

చివ‌రి నిమిషంలో గోల్‌.. ఉత్కంఠ పోరులో ఐవ‌రీ కోస్ట్ విజ‌యం

Jun 15 2026 7:12 AM | Updated on Jun 15 2026 11:55 AM

FIFA WC 2026: Ivory Coast Stuns Ecuador Ends-19 game Unbeaten

ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్ 2026 సీజ‌న్‌లో తొలిసారి ఉత్కంఠ‌భ‌రిత పోరుకు వేదికైంది. గ్రూప్‌-ఈలో భాగంగా ఈక్వెడార్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఐవ‌రీ కోస్ట్ 1-0 తేడాతో సంచ‌ల‌న విజ‌యం సాధించింది. ఆఖ‌రి వ‌ర‌కు నువ్వా నేనా అన్న‌ట్లుగా సాగిన పోరులో ఐవ‌రీ కోస్ట్ మిడ్ ఫీల్డ‌ర్ అమడ్ డియాల్లో (ఆట 90వ నిమిషంలో) గోల్ కొట్ట‌డంతో థ్రిల్లింగ్ విజ‌యాన్ని న‌మోదు చేసింది.

ఈ నేప‌థ్యంలో 19 మ్యాచ్‌ల్లో ఓట‌మి ఎరుగ‌ని ఈక్వెడార్‌కు ఐవ‌రీకోస్ట్ షాక్ ఇచ్చిన‌ట్ల‌యింది. 3 పాయింట్ల‌తో ఐవ‌రీ కోస్ట్ టోర్నీలో బోణీ కొట్ట‌గా, ఈక్వెడార్ ఇంకా ఖాతా తెర‌వలేదు. మ్యాచ్‌లో ఇరుజట్లు కొదమసింహాల్లా తలపడ్డాయి. ముఖ్యంగా ఈక్వెడార్ ఫస్ట్‌హాఫ్‌లో పదే పదే అటాకింగ్ గేమ్ ఆడి ఐవరీకోస్ట్‌ను హడలెత్తించింది. అంతేకాదు తొలి హాఫ్‌లోనే ఈక్వెడార్‌ రెండుసార్లు క్రాస్‌బార్‌ను తాకినప్పటికీ ఐవరీకోస్ట్ గోల్ కీపర్ సమర్థంగా అడ్డుకోవడంతో గోల్స్ రాలేదు. 

రెండో హాఫ్‌లోనూ చివరిదాకా గోల్‌కోసం ఇరుజట్లు చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ సఫలం కాలేకపోయాయి. ఇక మ్యాచ్ డ్రాగా ముగుస్తుందన్న సమయంలో ఆట 90వ నిమిషంలో మిడ్‌ఫీల్డర్ అమడ్ డియాల్లో  గోల్ కొట్టడంతో ఐవరీ కోస్ట్ బోణీ కొట్టింది. ఆ తర్వాత ఎక్స్‌ట్రా టైమ్‌లో ఈక్వెడార్ గోల్ కొట్టడంలో విఫలం కావడంతో ఐవరీ కోస్ట్ విజయాన్ని అందుకుంది. ఇదే గ్రూప్‌లో జరిగిన మ‌రో మ్యాచ్‌లో జ‌ర్మ‌నీ 7-1 తేడాతో కురాకావోపై విజ‌యం సాధించి ఘ‌నంగా త‌మ అడుగును ప్రారంభించింది.

డ్రాతో స‌రిపెట్టుకున్న నెద‌ర్లాండ్స్‌


మూడుసార్లు రన్న‌ర‌ప్‌గా నిలిచి నెద‌ర్లాండ్స్‌ ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్ 2026 ప్ర‌యాణాన్ని డ్రాతో ప్రారంభించింది. భార‌త కాల‌మాన ప్ర‌కారం సోమ‌వారం తెల్ల‌వారుజామున గ్రూప్‌-ఎఫ్‌లో భాగంగా జ‌పాన్‌తో జ‌రిగిన మ్యాచ్‌ను నెద‌ర్లాండ్స్ 2-2తో డ్రా చేసుకుంది. నెద‌ర్లాండ్స్ త‌ర‌ఫున విర్గిల్ వాన్ డిక్ (ఆట 51వ నిమిషంలో), క్రిసెనికో స‌మ్మ‌ర్‌విల్లె (ఆట 64వ నిమిషంలో) గోల్స్ సాధించ‌గా, జ‌పాన్ త‌ర‌ఫున కీటో న‌కామురా (ఆట 57వ నిమిషంలో), దైచీ క‌మ‌దా (ఆట 89వ నిమిషంలో) గోల్స్ సాధించారు. మ్యాచ్ డ్రాగా ముగియ‌డంతో ఇరుజ‌ట్ల‌కు చెరో 2 పాయింట్లు ల‌భించాయి.

చదవండి: 90 నిమిషాల్లో 12 గోల్స్‌.. 71 ఏళ్లుగా చెక్కుచెద‌ర‌ని రికార్డు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement