చరిత్ర సృష్టించిన పాకిస్తాన్‌ ఓపెనర్‌.. వరల్డ్‌కప్‌ చరిత్రలోనే | CWC 2023 NZ Vs PAK: Fakhar Zaman Hits Fastest Hundred By A Pakistan Batter In ODI World Cup History - Sakshi
Sakshi News home page

WC 2023 NZ Vs PAK: చరిత్ర సృష్టించిన పాకిస్తాన్‌ ఓపెనర్‌.. వరల్డ్‌కప్‌ చరిత్రలోనే

Published Sat, Nov 4 2023 6:01 PM

Fakhar Zaman hits fastest World Cup hundred by a Pakistan batter - Sakshi

పాకిస్తాన్‌ స్టార్‌ ఓపెనర్‌ ఫఖార్‌ జమాన్‌ అరుదైన ఘనత సాధించాడు. వన్డే ప్రపంచకప్‌ చరిత్రలో ఫాస్టెస్ట్‌ సెంచరీ చేసిన పాకిస్తాన్‌ ఆటగాడిగా రికార్డులకెక్కాడు. వన్డే ప్రపంచకప్‌-2023లో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో జమాన్‌ కేవలం 63 బంతుల్లోనే తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. 

తద్వారా ఈ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఇంతకుముందు ఈ రికార్డు పాకిస్తాన్‌ మాజీ ఆటగాడు ఇమ్రాన్‌ నజీర్‌ పేరిట ఉండేది. 2007 వన్డే వరల్డ్‌కప్‌లో కింగ్‌స్టన్‌ ఓవెల్‌ వేదికగా జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో 95 బంతుత్లో నజీర్‌ సెంచరీ సాధించాడు. తాజా మ్యాచ్‌తో నజీర్‌ రికార్డును జమాన్‌ ‍బ్రేక్‌ చేశాడు.

అదే విధంగా వరల్డ్‌కప్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన నజీర్‌ రికార్డును కూడా జమాన్‌ బద్దలు కొట్టాడు. జింబాబ్వేతో మ్యాచ్‌లో నజీర్‌ 8 సిక్స్‌లు బాదాడు. ప్రస్తుతం న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో 9 సిక్స్‌లు కొట్టిన జమాన్‌.. నజీర్‌ను అధిగమించాడు.

మ్యాచ్‌కు అంతరాయం..
కాగా చెన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న పాకిస్తాన్‌-న్యూజిలాండ్‌ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. ఆట నిలిచిపోయే సమయానికి పాకిస్తాన్‌ 21. 3 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 160 పరుగులు చేసింది. క్రీజులో ఫఖార్‌ జమాన్‌(106), బాబర్‌ ఆజం(42) పరుగులతో ఉన్నారు. కాగా అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ నిర్ణీత  50 ఓ‍వర్లలో 6 వికెట్ల నష్టానికి 401 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది.

కివీస్‌ బ్యాటర్లలో రచిన్‌ రవీంద్ర(108) సెంచరీతో చెలరేగగా.. కేన్‌ విలియమ్సన్‌(95), గ్లెన్‌ ఫిలిప్స్‌(41) పరుగులతో అద్బుతమైన ఇన్నింగ్స్‌లు ఆడారు. పాక్‌ బౌలర్లలో వసీం మూడు వికెట్లు సాధించగా.. రవూఫ్‌, ఇఫ్తికర్‌, హసన్‌ అలీ ఒక్క వికెట్‌ సాధించారు.
చదవండి: World Cup 2023: హార్దిక్‌ పాండ్యా అవుట్.. కెఎల్ రాహుల్‌కి ప్రమోషన్! వన్డే వరల్డ్‌ కప్‌లో

Advertisement
Advertisement