
వన్డే వరల్డ్‌కప్-2023లో టీమిండియా వైస్ కెప్టెన్‌గా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఎంపికయ్యాడు. రోహిత్ శర్మకు డిప్యూటీగా ఉన్న హార్దిక్ పాండ్యా గాయం కారణంగా టోర్నీ నుంచి వైదొలగడంతో .. అతడి స్ధానాన్ని రాహుల్‌తో బీసీసీఐ భర్తీ చేసింది. ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్న రాహుల్.. 2022 టీ20 వరల్డ్ కప్‌లో కూడా వైస్ కెప్టెన్‌గా వ్యవహరించాడు.
ఆ తర్వాత తన ఫామ్‌ను కోల్పోడంతో రాహుల్‌ను వైస్ కెప్టెన్సీ బాధ్యతలనుంచి తప్పించి.. హార్దిక్‌కు ఆ బాధ్యతలు అప్పగిచింది. అయితే హార్దిక్ ఇప్పడు గాయం బారిన పడడంతో మళ్లీ రాహుల్‌నే వైస్ కెప్టెన్సీ వరించింది. బంగ్లాదేశ్‌తో మ్యాచ్ సందర్భంగా గాయపడిన హార్దిక్.. టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు.
ఈ విషయాన్ని శనివారం ఐసీసీ వెల్లడించింది. హార్దిక్ స్ధానాన్ని యువ పేసర్ ప్రసిద్ద్ కృష్ణతో బీసీసీఐ సెలక్షన్ కమిటీ భర్తీ చేసింది. ఇక ఇప్పటికే సెమీస్ బెర్త్‌ను ఖారారు చేసుకున్న టీమిండియా.. ఆదివారం జోరు మీద ఉన్న దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ఈ మ్యాచ్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగనుంది.
చదవండి: World Cup 2023: షాహీన్ అఫ్రిది అత్యంత చెత్త రికార్డు.. వరల్డ్‌కప్ చరిత్రలోనే