సాక్ష్యం కనబడుతోందా?: ఆపరేషన్‌ సిందూర్‌పై భారత బాక్సర్‌ రియాక్షన్‌ | Evidence Is Loud And Clear: Gaurav Bidhuri Sports Icons Salute Operation Sindoor | Sakshi
Sakshi News home page

సరైన సమాధానం.. సాక్ష్యం కనబడుతోందా?.. ఆపరేషన్‌ సిందూర్‌పై స్పందనలు

May 7 2025 1:35 PM | Updated on May 7 2025 1:55 PM

Evidence Is Loud And Clear: Gaurav Bidhuri Sports Icons Salute Operation Sindoor

ఆపరేషన్‌ సిందూర్‌.. యావత్‌ భారతావని నోట ఇప్పుడిదే మాట.. పహల్గామ్‌ ఉగ్రదాడికి భారత సైన్యం సరైన రీతిలో సమాధానం ఇచ్చిందంటూ సర్వత్రా హర్షాతిరేకాలు.. ఉన్మాదంతో అమాయకపు ఆడబిడ్డల నుదిటిన సిందూరం తుడిపేసిన ముష్కరులకు అదే పేరుతో బదులిచ్చినందుకు సెల్యూట్‌ అంటూ ఆర్మీపై ప్రశంసల జల్లు..

జై హింద్‌
భారత క్రీడాలోకం కూడా ఆపరేషన్‌ సిందూర్‌ (Operation Sindoor) పట్ల హర్షం వ్యక్తం చేస్తోంది. టీమిండియా హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌, మాజీ క్రికెటర్లు వీరేందర్‌ సెహ్వాగ్‌, ఆకాశ్‌ చోప్రా, సురేశ్‌ రైనా జై హింద్‌ అంటూ భారత సైన్యానికి తమ మద్దతు తెలియజేశారు.

సరైన సమాధానం
ఇక ప్రముఖ బాక్సర్‌ గౌరవ్‌ బిధూరి (Gaurav Bidhuri) భారత ఆర్మీని ప్రశంసిస్తూనే.. విమర్శకులకు గట్టి కౌంటర్‌ ఇచ్చాడు. ‘‘మనం మన ఇళ్లల్లో ప్రశాంతంగా నిద్రపోతున్న వేళ.. మన సైన్యం ఆపరేషన్‌ సిందూర్‌ అమలు చేసింది.

కానీ మనమేమో రోజూ ఇక్కడ స్టూడియ్లో కూర్చుని.. ‘మోదీ జీ యుద్ధం చేయండి! ఇంకెందుకు వాళ్లపై దాడులు చేయడం లేదు’ అంటూ అరుస్తూ ఉంటాము.

ఇప్పుడు అందరికీ సరైన సమాధానం దొరికింది కదా!.. ఇంట్లో కూర్చుని ఎవరైనా ఉచిత సలహాలు ఇవ్వవచ్చు. కానీ ఇలాంటి సైనిక చర్యలు చేపట్టాలంటే కచ్చితమైన ప్రణాళిక, వ్యూహాలు, ప్రత్యర్థి స్పందించే తీరుకు ఎలా బదులివ్వాలి.. పరిణామాలను ఎలా ఎదుర్కోవాలి.. ఇలా ఎన్నో ప్లాన్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

మన ఆర్మీ అందుకు తగ్గ సమయం తీసుకుని సరైన సమయంలో పంజా విసిరింది. ఒక్క మిషన్‌తో 8-9 ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశారు’’ అని గౌరవ్‌ బిధూరి IANSతో పేర్కొన్నాడు.

ఈ సాక్ష్యం సరిపోతుందా? 
అదే విధంగా.. పహల్గామ్‌ దాడికి పాకిస్తాన్‌ కారణం అనడానికి ఆధారాలు చూపాలన్న పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ షాహిద్‌ ఆఫ్రిదికి మరోసారి తనదైన శైలిలో కౌంటర్‌ ఇచ్చాడు. ‘‘కొంతమంది మాకు ఆధారాలు కావాలని డిమాండ్‌ చేశారు కదా! ఇప్పటికైనా అర్థమైందా? ఈ సాక్ష్యం సరిపోతుందా? అంతా స్పష్టంగానే ఉంది కదా! ఇంతకంటే గొప్పగా ఇంకేమైనా కావాలా?’’ అంటూ గౌరవ్‌ బిధూరి ఆఫ్రిది చురకలు అంటించాడు.

అదే విధంగా.. ‘‘ఏదేమైనా ఈరోజు దేశం మొత్తం భారత సైన్యం, మన నాయకత్వం వెంట ఉంది. ఇది కేవలం ప్రతిచర్య మాత్రమే కాదు.. న్యాయం చేయడం కూడా! మనపై దాడి చేయాలనుకునేవారికి సందేశం. మీ చర్యలకు తప్పకుండా బదులిస్తామనే సంకేతం. జై హింద్‌’’ అంటూ గౌరవ్‌ బిధూరి ఉద్వేగానికి లోనయ్యాడు.

కాళ్ల పారాణి ఆరకముందే చెరిగిన సిందూరం
కాగా జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో గత నెల ఉగ్రవాదులు మారణహోం సృష్టించిన విషయం విదితమే.ప్రశాంత బైసరన్‌ లోయలో కల్లోలం సృష్టించి ఇరవై ఆరు మంది పర్యాటకులను కాల్చి చంపేశారు. మతం పేరు అడుగుతూ పురుషుల ప్రాణాలు తీశారు. 

మొదటగా నేవీ అధికారి లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ (26)ను కాల్చారు. నవ వరుడైన వినయ్‌ భార్య హిమాన్షితో కలిసి హనీమూన్‌కు రాగా.. ఉగ్రవాదుల దుశ్చర్యతో పెళ్తైన ఆరు రోజులకే ఆమె నుదిటి సిందూరం చెరిగిపోయింది.

హిమాన్షితో మాదిరే మరికొంత మంది మహిళలు తమ భర్తల్ని కోల్పోగా.. ఆపరేషన్‌ సిందూర్‌ పేరిట ఉగ్రవాదులకు ఆర్మీ ఇలా సరైన విధంగా బుద్ధిచెప్పింది. తెల్లవారుజామున ఒంటి గంట తర్వాత దాదాపు ఇరవై మూడు నిమిషాల పాటు జరిగిన ఆపరేషన్‌లో పాకిస్తాన్‌, పాక్‌ ఆక్రమిత కశ్మీర్లో ఉన్న ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది. కాగా పహల్గామ్‌ ఘటనలో ఇంకొందరు తమ తండ్రి, సోదరుడు, కుమారులను కోల్పోయారు. 

చదవండి: Operation Sindoor: ఎవరీ కల్నల్‌ సోఫియా, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement