breaking news
Gaurav Biduri
-
సాక్ష్యం కనబడుతోందా?: ఆపరేషన్ సిందూర్‌పై భారత బాక్సర్ రియాక్షన్
ఆపరేషన్ సిందూర్.. యావత్ భారతావని నోట ఇప్పుడిదే మాట.. పహల్గామ్ ఉగ్రదాడికి భారత సైన్యం సరైన రీతిలో సమాధానం ఇచ్చిందంటూ సర్వత్రా హర్షాతిరేకాలు.. ఉన్మాదంతో అమాయకపు ఆడబిడ్డల నుదిటిన సిందూరం తుడిపేసిన ముష్కరులకు అదే పేరుతో బదులిచ్చినందుకు సెల్యూట్ అంటూ ఆర్మీపై ప్రశంసల జల్లు..జై హింద్భారత క్రీడాలోకం కూడా ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) పట్ల హర్షం వ్యక్తం చేస్తోంది. టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్, మాజీ క్రికెటర్లు వీరేందర్ సెహ్వాగ్, ఆకాశ్ చోప్రా, సురేశ్ రైనా జై హింద్ అంటూ భారత సైన్యానికి తమ మద్దతు తెలియజేశారు.సరైన సమాధానంఇక ప్రముఖ బాక్సర్ గౌరవ్ బిధూరి (Gaurav Bidhuri) భారత ఆర్మీని ప్రశంసిస్తూనే.. విమర్శకులకు గట్టి కౌంటర్ ఇచ్చాడు. ‘‘మనం మన ఇళ్లల్లో ప్రశాంతంగా నిద్రపోతున్న వేళ.. మన సైన్యం ఆపరేషన్ సిందూర్ అమలు చేసింది.కానీ మనమేమో రోజూ ఇక్కడ స్టూడియ్లో కూర్చుని.. ‘మోదీ జీ యుద్ధం చేయండి! ఇంకెందుకు వాళ్లపై దాడులు చేయడం లేదు’ అంటూ అరుస్తూ ఉంటాము.ఇప్పుడు అందరికీ సరైన సమాధానం దొరికింది కదా!.. ఇంట్లో కూర్చుని ఎవరైనా ఉచిత సలహాలు ఇవ్వవచ్చు. కానీ ఇలాంటి సైనిక చర్యలు చేపట్టాలంటే కచ్చితమైన ప్రణాళిక, వ్యూహాలు, ప్రత్యర్థి స్పందించే తీరుకు ఎలా బదులివ్వాలి.. పరిణామాలను ఎలా ఎదుర్కోవాలి.. ఇలా ఎన్నో ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది.మన ఆర్మీ అందుకు తగ్గ సమయం తీసుకుని సరైన సమయంలో పంజా విసిరింది. ఒక్క మిషన్‌తో 8-9 ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశారు’’ అని గౌరవ్ బిధూరి IANSతో పేర్కొన్నాడు.ఈ సాక్ష్యం సరిపోతుందా? అదే విధంగా.. పహల్గామ్ దాడికి పాకిస్తాన్ కారణం అనడానికి ఆధారాలు చూపాలన్న పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిదికి మరోసారి తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చాడు. ‘‘కొంతమంది మాకు ఆధారాలు కావాలని డిమాండ్ చేశారు కదా! ఇప్పటికైనా అర్థమైందా? ఈ సాక్ష్యం సరిపోతుందా? అంతా స్పష్టంగానే ఉంది కదా! ఇంతకంటే గొప్పగా ఇంకేమైనా కావాలా?’’ అంటూ గౌరవ్ బిధూరి ఆఫ్రిది చురకలు అంటించాడు.అదే విధంగా.. ‘‘ఏదేమైనా ఈరోజు దేశం మొత్తం భారత సైన్యం, మన నాయకత్వం వెంట ఉంది. ఇది కేవలం ప్రతిచర్య మాత్రమే కాదు.. న్యాయం చేయడం కూడా! మనపై దాడి చేయాలనుకునేవారికి సందేశం. మీ చర్యలకు తప్పకుండా బదులిస్తామనే సంకేతం. జై హింద్’’ అంటూ గౌరవ్ బిధూరి ఉద్వేగానికి లోనయ్యాడు.కాళ్ల పారాణి ఆరకముందే చెరిగిన సిందూరంకాగా జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్లో గత నెల ఉగ్రవాదులు మారణహోం సృష్టించిన విషయం విదితమే.ప్రశాంత బైసరన్ లోయలో కల్లోలం సృష్టించి ఇరవై ఆరు మంది పర్యాటకులను కాల్చి చంపేశారు. మతం పేరు అడుగుతూ పురుషుల ప్రాణాలు తీశారు. మొదటగా నేవీ అధికారి లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ (26)ను కాల్చారు. నవ వరుడైన వినయ్ భార్య హిమాన్షితో కలిసి హనీమూన్‌కు రాగా.. ఉగ్రవాదుల దుశ్చర్యతో పెళ్తైన ఆరు రోజులకే ఆమె నుదిటి సిందూరం చెరిగిపోయింది.హిమాన్షితో మాదిరే మరికొంత మంది మహిళలు తమ భర్తల్ని కోల్పోగా.. ఆపరేషన్ సిందూర్ పేరిట ఉగ్రవాదులకు ఆర్మీ ఇలా సరైన విధంగా బుద్ధిచెప్పింది. తెల్లవారుజామున ఒంటి గంట తర్వాత దాదాపు ఇరవై మూడు నిమిషాల పాటు జరిగిన ఆపరేషన్‌లో పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉన్న ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది. కాగా పహల్గామ్ ఘటనలో ఇంకొందరు తమ తండ్రి, సోదరుడు, కుమారులను కోల్పోయారు. చదవండి: Operation Sindoor: ఎవరీ కల్నల్ సోఫియా, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ -
గౌరవ్ బిధురికి కాంస్యం
ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో వైల్డ్ కార్డు ద్వారా ప్రవేశించిన గౌరవ్ బిధురికాంస్య పతకంతో చరిత్ర సృష్టించాడు. గురువారం హాంబర్గ్‌లో జరిగిన సెమీ ఫైనల్లో (56 కేజీల విభాగం) గౌరవ్, డ్యూక్ రగన్ (అమెరికా) చేతిలో పరాజయం చెందాడు. దీంతో భారత్ నుంచి ఈ టోర్నీలో పతకం సాధించిన విజేందర్ (2009), వికాస్ క్రిషన్ (2011), శివ థాపా (2015) సరసన 24 ఏళ్ల గౌరవ్ కూడా చేరాడు. తాజాగా భారత్ ఈ ఒక్క పతకంతోనే చాంపియన్‌షిప్‌ను ముగించింది. -
గౌరవ్‌కు పతకం ఖాయం
హాంబర్గ్ (జర్మనీ): అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న భారత బాక్సర్ గౌరవ్ బిధురి సంచలనం సృష్టించాడు. ప్రపంచ సీనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్ చరిత్రలో పతకం నెగ్గిన నాలుగో భారతీయ బాక్సర్‌గా గుర్తింపు పొందాడు. ఈ మెగా ఈవెంట్‌కు గౌరవ్ నేరుగా అర్హత పొందకపోయినా ఆసియా బాక్సింగ్ సమాఖ్య ‘వైల్డ్ కార్డు’ ఇవ్వడంతో బరిలోకి దిగాడు. వాస్తవానికి ఈ వైల్డ్ కార్డు ఎంట్రీ భూటాన్‌కు కేటాయించినా వారు ఆసక్తి చూపకపోవడంతో గౌరవ్‌కు ఈ అవకాశం లభించింది. మంగళవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో గౌరవ్ 3–0తో బిలెల్ మహమ్‌దీ (ట్యూనిషియా)పై విజయం సాధించి సెమీఫైనల్‌కు చేరుకున్నాడు. తద్వారా కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకున్నాడు. ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్ చరిత్రలో ఇప్పటివరకు భారత్ తరఫున విజేందర్ సింగ్ (2009), వికాస్ కృషన్ (2011), శివ థాపా (2015) కాంస్య పతకాలను సాధించారు. వీరి సరసన గౌరవ్ కూడా చేరనున్నాడు. మరోవైపు ఒలింపిక్ చాంపియన్ హసన్‌బాయ్ దుస్మతోవ్ (ఉజ్బెకిస్తాన్)తో జరిగిన 49 కేజీల విభాగం క్వార్టర్ ఫైనల్లో అమిత్ ఫంగల్ (భారత్)... కిమ్ ఇన్‌క్యు (దక్షిణ కొరియా)తో జరిగిన 52 కేజీల విభాగం క్వార్టర్ ఫైనల్లో కవీందర్ బిష్త్ (భారత్) ఓడిపోయారు. దాంతో ఈ పోటీల్లో భారత్ ఖాతాలో ఒక పతకం మాత్రమే చేరనుంది.