మా జట్టు కంటే అఫ్గానిస్తాన్‌ ఎంతో బెటర్‌: షోయబ్‌ మాలిక్‌ | Shoaib Malik Made Shocking Comments On Pakistan Team Over Failer In WC Run, Says Even AFG Better Than PAK - Sakshi
Sakshi News home page

Shoaib Malik On PAK Team: మా జట్టు కంటే అఫ్గానిస్తాన్‌ ఎంతో బెటర్‌

Published Sat, Nov 11 2023 5:15 PM | Last Updated on Sat, Nov 11 2023 5:37 PM

Even AFG Better Than Us: Shoaib Malik Harsh Assessment Of PAKs Failed WC Run - Sakshi

వన్డే వరల్డ్‌కప్‌-2023లో పాకిస్తాన్‌ తమ స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయడంలో విఫలమైంది. టోర్నీ ఆరంభ మ్యాచ్‌ల్లో అదరగొట్టిన పాకిస్తాన్‌.. తర్వాతి మ్యాచ్‌ల్లో మాత్రం వరుస ఓటముల చవిచూసింది. దీంతో ఇటువంటి పోటీ ఇవ్వకుండా టోర్నీ నుంచి పాక్‌ నిష్కమ్రిస్తుందని అంతా భావించారు. కానీ బంగ్లాదేశ్‌, న్యూజిలాండ్‌పై అద్బుత విజయాలు సాధించినపాకిస్తాన్‌  మళ్లీ  సెమీస్‌ రేసులో నిలిచింది.

అయితే శ్రీలంకపై కీలక మ్యాచ్‌లో ఘన విజయం సాధించిన న్యూజిలాండ్‌.. పాక్‌ సెమీస్‌ ఆశలపై నీళ్లు జల్లింది. అయితే పాకిస్తాన్‌ తమ ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై 287 పరుగులతో తేడాతో విజయం సాధిస్తే సెమీస్‌కు చేరే ఛాన్స్‌ ఉండేది. కానీ ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో పాకిస్తాన్‌ టాస్ ఓడిపోవడంతో సెమీస్‌కు చేరే దారులు మూసుకుపోయాయి.

ఇక తాజాగా పాకిస్తాన్‌ జట్టును ఉద్దేశించి ఆ దేశ మాజీ కెప్టెన్‌ షోయబ్‌ మాలిక్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు. పాక్‌ జట్టు కంటే అఫ్గానిస్తాన్‌ ఎంతో బెటర్‌ అని మాలిక్‌ అభిప్రాయపడ్డాడు. "వన్డే ప్రపంచకప్‌-2023లో మా జట్టు కంటే అఫ్గానిస్తాన్‌ మెరుగైన క్రికెట్‌ ఆడింది. అఫ్గాన్స్‌ అద్భుతమైన పోరాట పటిమ ప్రదర్శన కనబరిచారు" అని పెవిలియన్‌ షోలో మాలిక్‌ పేర్కొన్నాడు.

ఇదో షోలో మరో పాక్‌ క్రికెట్‌ దిగ్గజం వసీం అక్రమ్‌ మాట్లాడుతూ.."అఫ్గానిస్తాన్‌ జట్టు మాకంటే బలంగా కన్పించింది. మా బాయ్స్‌ నిరంతరం క్రికెట్ ఆడటం వల్ల బాగా అలసిపోయారు. నిజంగా అఫ్గానిస్తాన్‌ మాత్రం అద్బుతమైన క్రికెట్‌ ఆడిందని చెప్పుకొచ్చాడు.
చదవండి: WC 2023: వరల్డ్‌కప్‌లో దారుణ ప్రదర్శన.. పాకిస్తాన్‌ కెప్టెన్సీకి బాబర్‌ ఆజం గుడ్‌బై..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement