ఇంగ్లండ్ జట్టుకు ఊహించని షాక్.. బూట్లు ఎత్తుకెళ్లిన దొంగలు! | England Players Boots, Training Gear Stolen In USA Ahead Of FIFA World Cup Opener | Sakshi
Sakshi News home page

ఇంగ్లండ్ జట్టుకు ఊహించని షాక్.. బూట్లు ఎత్తుకెళ్లిన దొంగలు!

Jun 13 2026 11:43 AM | Updated on Jun 13 2026 12:15 PM

England Players Boots, Training Gear Stolen In USA Ahead Of FIFA World Cup Opener

ఫిఫా ప్ర‌పంచ‌కప్‌-2026లో పాల్గోనేందుకు అమెరికాకు వెళ్లిన ఇంగ్లండ్ జ‌ట్టుకు చేదు అనుభ‌వం ఎదురైంది. ఆటగాళ్లకు సంబంధించిన పలు జతల బూట్లు  శిక్షణకు ఉపయోగించే పరికరాలు, మ్యాచ్ బాల్స్ భారీగా దొంగతనానికి గురయ్యాయి. 

ఫ్లోరిడాలోని వారి ప్రాక్టీస్‌ క్యాంప్‌ నుంచి మిస్సోరిలోని 'స్వోప్ సాకర్ విలేజ్‌కు' సామాగ్రిని తరలిస్తుండగా  ఈ ఘటన చోటు చేసుకుంది. వ్యాన్ తాళాలను పగులగొట్టి ఈ దొంగతానికి పాల్పడ్డారు. ఆ వ్యాన్‌లో ఒక్క ఫుట్‌బాల్‌ను మాత్రమే విడిచిపెట్టారు.

దొంగిలించబడిన వాటిలో ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ కేన్, స్టార్ మిడ్‌ఫీల్డర్ జూడ్ బెల్లింగ్‌హామ్ వ్యక్తిగత మ్యాచ్ బూట్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఈ మెగా టోర్నీలో భాగంగా ఇంగ్లండ్ తమ తొలి మ్యాచ్‌లో జూన్ 18న క్రొయేషియాతో తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం ఇంగ్లండ్ జట్టు శనివారం కాన్సాస్ సిటీలో తొలి ట్రైనింగ్ సెషన్‌లో పాల్గొనాల్సి ఉంది. 

అంతలోనే ఈ ఊహించని సంఘటన చోటు చేసుకోవడంతో ఇంగ్లీష్ ప్లేయర్లకు షాక్‌కు గురయ్యారు. ఈ ఘటనపై కాన్సాస్ పోలీసులు వేగంగా స్పందించారు. ఇప్పటికే ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
చదవండి: FIFA World Cup 2026: అమెరికా సంచలన విజయం.. ఫిఫా చరిత్రలోనే

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement