టీమిండియాతో టెస్టు సిరీస్‌.. ఇంగ్లండ్‌కు వ‌రుస షాక్‌లు | England lose Olly Stone to injury for India Test series | Sakshi
Sakshi News home page

IND vs ENG: టీమిండియాతో టెస్టు సిరీస్‌.. ఇంగ్లండ్‌కు వ‌రుస షాక్‌లు

Apr 4 2025 5:09 PM | Updated on Apr 4 2025 5:44 PM

England lose Olly Stone to injury for India Test series

టీమిండియాతో స్వ‌దేశంలో జ‌ర‌గ‌నున్న ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు ముందు ఇంగ్లండ్ క్రికెట్ జ‌ట్టును గాయాల బెడ‌ద వెంటాడుతోంది. ఇప్ప‌టికే స్టార్ పేస‌ర్ మార్క్ వుడ్ సేవ‌ల‌ను కోల్పోయిన ఇంగ్లండ్‌.. తాజాగా మ‌రో ఫాస్ట్ బౌల‌ర్ ఈ జాబితాలో చేరాడు.

ఓలీ స్టోన్ గాయం కార‌ణంగా భార‌త్‌తో సిరీస్‌కు దూర‌మ‌య్యాడు.  ఈ విష‌యాన్ని ఇంగ్లండ్ అండ్‌ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) ధ్రువీక‌రించింది. స్టోన్ ఇంగ్లండ్ త‌ర‌పున ఇప్ప‌టివ‌ర‌కు ఐదు టెస్టులు ఆడాడు. గ‌త వేస‌విలో ఇంగ్లండ్ జ‌ట్టులో రెగ్యూల‌ర్‌గా స్టోన్ ఉన్నాడు. అయితే గ‌త నెల‌లో అత‌డి కుడి మోకాలికి గాయ‌మైంది.

దీంతో రాబోయే 14 వారాల పాటు ఆటకు దూరంగా ఉండ‌నున్నాడు. ఈ ఏడాది ఆగస్టు నాటికి స్టోన్ కోలుకుంటాడ‌ని ఈసీబీ పేర్కొంది. కానీ భార‌త్‌-ఇంగ్లండ్ మ‌ధ్య సిరీస్ ఆగ‌స్టు 4తో ముగియ‌నుంది. మ‌రోవైపు కెప్టెన్ బెన్ స్టోక్స్ ఫిట్‌నెస్ కూడా ఇంగ్లండ్ జ‌ట్టు మెనెజ్‌మెంట్‌ను క‌ల‌వ‌ర‌పెడుతోంది. 

స్టోక్స్ ప్ర‌స్తుతం తొడకండరాల గాయంతో బాధ‌ప‌డుతున్నాడు. గ‌తేడాది ఆఖ‌రిలో త‌న గాయానికి శ‌స్త్ర‌చికిత్స చేయించుకున్నాడు. అత‌డు ఇంకా పూర్తి ఫిట్‌నెస్ సాధించ‌లేదు. ఈ స్టార్ ఆల్‌ రౌండర్ వ‌చ్చే నెల‌లో కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో ఉండాల్సి ఉంది.

కానీ తొలి రౌండ్ మ్యాచ్‌ల‌కు స్టోక్స్ దూరం కానున్నాడ‌ని డర్హామ్ ప్రధాన కోచ్ ర్యాన్ కాంప్‌బెల్ వెల్ల‌డించాడు. క‌నీసం భార‌త్‌తో సిరీస్ నాటికైనా అత‌డి ఫిట్‌నెస్ సాధించాల‌ని ఇంగ్లండ్ అభిమానులు కోరుకుంటున్నారు.

భార‌త్‌, ఇంగ్లండ్ టెస్టు సిరీస్ షెడ్యూల్ ఇదే..
తొలి టెస్టు – జూన్ 20 నుంచి జూన్‌ 24 వ‌ర‌కు – హెడింగ్లీ
రెండో టెస్టు – జూలై 2 నుంచి జూలై 6 వ‌ర‌కు – ఎడ్జ్‌బాస్టన్
మూడో టెస్టు – జూలై 10 నుంచి జూలై 14 వ‌ర‌కు – లార్డ్స్‌
నాలుగో టెస్టు – జూలై 24 నుంచి జూలై 27 వ‌ర‌కు – ఓల్డ్ ట్రాఫోర్డ్
ఐదో టెస్టు – జూలై 31 నుంచి ఆగ‌స్టు 4 వ‌ర‌కు – కెన్నింగ్టన్ ఓవల్
చదవండి: అప్పట్లో పంజాబ్‌.. ఇప్పుడు సన్‌రైజర్స్‌: సెహ్వాగ్‌ ఘాటు విమర్శలు
 

Advertisement
 
Advertisement
Advertisement