మూడో రౌండ్‌లో జొకోవిచ్‌ | Djokovic in the third round | Sakshi
Sakshi News home page

మూడో రౌండ్‌లో జొకోవిచ్‌

Jul 5 2024 4:06 AM | Updated on Jul 5 2024 4:06 AM

Djokovic in the third round

లండన్‌: వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నీలో మాజీ చాంపియన్‌ జొకోవిచ్‌ (సెర్బియా) మూడో రౌండ్‌లోకి ప్రవేశించాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్‌ రెండో రౌండ్‌లో రెండో సీడ్‌ జొకోవిచ్‌ 6–3, 6–4, 5–7, 7–5తో జేకబ్‌ ఫెర్న్‌లె (బ్రిటన్‌) పై గెలుపొందాడు. మరో రెండో రౌండ్‌ మ్యాచ్‌లో టాప్‌ సీడ్‌ యానిక్‌ సినెర్‌ (ఇటలీ) 3 గంటల 42 నిమిషాల్లో 7–6 (7/3), 7–6 (7/4), 2–6, 7–6 (7/4)తో బెరెటిని (ఇటలీ)పై గెలిచాడు. 

మహిళల సింగిల్స్‌ రెండో రౌండ్‌లో ఐదో సీడ్‌ జెస్సికా పెగూలా (అమెరికా) 4–6, 7–6 (9/7), 1–6తో జిన్‌యు వాంగ్‌ (చైనా) చేతిలో ఓడిపోయింది. పురుషుల డబుల్స్‌లో రోహన్‌ బోపన్న (భారత్‌)–ఎబ్డెన్‌ (ఆ్రస్టేలియా); యూకీ బాంబ్రీ (భారత్‌)–అల్బానో ఒలివెట్టి (ఫ్రాన్స్‌) జోడీలు తొలి రౌండ్‌లో నెగ్గి రెండో రౌండ్‌లోకి అడుగు పెట్టాయి.    

Advertisement
 
Advertisement
Advertisement