ప్రిక్వార్టర్స్‌లో జొకోవిచ్‌ | Djokovic in Wimbledon pre quarters | Sakshi
Sakshi News home page

ప్రిక్వార్టర్స్‌లో జొకోవిచ్‌

Jul 4 2026 3:20 AM | Updated on Jul 4 2026 3:20 AM

Djokovic in Wimbledon pre quarters

లండన్‌: వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నీ చరిత్రలో అత్యధిక విజయాలు సాధించిన ప్లేయర్‌గా స్విట్జర్లాండ్‌ దిగ్గజం రోజర్‌ ఫెడరర్‌ (105) పేరిట ఉన్న రికార్డును సెర్బియా స్టార్‌ జొకోవిచ్‌ సమం చేశాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ మూడో రౌండ్‌లో ఏడుసార్లు చాంపియన్‌ జొకోవిచ్‌ 7–5, 6–4, 1–6, 7–6 (7/4)తో ఆర్థర్‌ రిండెర్‌నీచ్‌ (ఫ్రాన్స్‌)పై గెలుపొందాడు. తద్వారా ఓవరాల్‌గా ఈ టోర్నీ లో 105వ విజయంతో జొకోవిచ్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్‌కు చేరుకున్నాడు. 

డిఫెండింగ్‌ చాంపియన్, ప్రపంచ నంబర్‌వన్‌ యానిక్‌ సినెర్‌ (ఇటలీ) కూడా ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించాడు. మూడో రౌండ్‌లో సినెర్‌ 6–4, 6–3, 6–4తో జెన్సన్‌ బ్రూక్స్‌బై (అమెరికా)పై విజయం సాధించాడు. మహిళల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్‌ సబలెంకా (బెలారూస్‌), నాలుగో సీడ్‌ జెస్సికా పెగూలా (అమెరికా), 11వ సీడ్‌ బెన్‌చిచ్‌ (స్విట్జర్లాండ్‌), పదో సీడ్‌ ముకోవా (చెక్‌ రిపబ్లిక్‌), 14వ సీడ్‌ నయోమి ఒసాకా (జపాన్‌) ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి అడుగు పెట్టారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement