ధోని షాట్లకు ఫిదా.. భయపెట్టేసింది! ఈమె ఎవరో గుర్తుపట్టారా? | Sakshi
Sakshi News home page

Dhoni: ధోని షాట్లకు ఫిదా.. భయపెట్టేసింది! ఈమె ఎవరో గుర్తుపట్టారా?

Published Mon, Apr 15 2024 4:12 PM

Dhoni Sixes Neha Dhupia Goes Ecstatic MI vs CSK IPL 2024 With Kareena Kapoor - Sakshi

ఐపీఎల్‌-2024.. చెన్నై సూపర్‌ కింగ్స్‌తో ముంబై ఇండియన్స్‌ మ్యాచ్‌.. మహేంద్ర సింగ్‌ ధోని బ్యాట్‌ పట్టుకుని మైదానంలో దిగగానే వాంఖడే స్టేడియం హోరెత్తిపోయింది. ముంబై ఇండియన్స్‌ అభిమానులు సైతం ఈ సీఎస్‌కే స్టార్‌ హిట్టింగ్‌ బాదితే చూడాలని తహతహలాడిపోయారు.

వారి అంచనాలను నిజం చేస్తూ ధోని ఆఖరి ఓవర్లో వరుసగా మూడు సిక్స్‌లు బాదాడు. వింటేజ్‌ ధోనిని గుర్తు చేస్తూ విధ్వంసకర బ్యాటింగ్‌తో విరుచుకుపడ్డాడు. ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా బౌలింగ్‌లో (చివరి ఓవర్‌ మూడు, నాలుగు, ఐదో బంతికి) హ్యాట్రిక్‌ సిక్సర్లతో ధోని కనువిందు చేశాడు. దీంతో అభిమానుల సంబరాలు అంబరాన్నంటాయి.

కూర్చున్న సీట్ల నుంచి లేచి నిలబడి.. గంతులేస్తూ ‘తలా’ ఇన్నింగ్స్‌ను సెలబ్రేట్‌ చేసుకున్నారు. వీరిలో సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా ఉండటం విశేషం. దివంగత క్రికెటర్‌ బిషన్‌ సింగ్‌ బేడి కోడలు, బాలీవుడ్‌ నటి నేహా ధుపియా అయితే ధోని బాదిన షాట్లకు ఫిదా అయింది. సంతోషం పట్టలేక పెద్దగా అరుస్తూ వైల్డ్‌గా సెలబ్రేట్‌ చేసుకుంది. 

ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను నేహా సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా వైరల్‌ అవుతున్నాయి. ఇక నెటిజన్లు.. ‘‘వామ్మో.. నీ రియాక్షన్‌ భయపెట్టేలా ఉంది. మరీ అంత ఆనందమా?’’ అంటూ తమదైన శైలిలో నేహాను సరదాగా ట్రోల్‌ చేస్తున్నారు.

 కాగా ముంబై- చెన్నై మ్యాచ్‌కు నేహా ధుపియా తన భర్త అంగద్‌ బేడి, స్నేహితులు కరీనా కపూర్‌, జాన్‌ అబ్రహంలతో కలిసి హాజరైంది. కాగా అంగద్‌ బేడి అండర్‌-19 స్థాయిలో ఢిల్లీ తరఫున క్రికెట్‌ ఆడాడు. ఆ తర్వాత మోడల్‌గా మారి నటుడిగానూ ఎదిగాడు.

ముంబై వర్సెస్‌ చెన్నై స్కోర్లు
►వేదిక: వాంఖడే, ముంబై- ఆదివారం
►టాస్‌: ముంబై.. బౌలింగ్‌

►చెన్నై స్కోరు: 206/4 (20)
►ముంబై స్కోరు: 186/6 (20)

►ఫలితం: 20 పరుగుల తేడాతో ముంబైపై చెన్నై విజయం
►ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: మతీశ పతిరణ(4/28).

చదవండి: #Hardik Pandya: అతడిదంతా నటన! ధోని సిక్సర్లు కొడుతుంటే అలా..

Advertisement
 
Advertisement