ప్రపంచకప్‌లో సంచలనం | Dhiraj, Kumkum stun Olympic champions South Korea to clinch recurve mixed team gold | Sakshi
Sakshi News home page

ప్రపంచకప్‌లో సంచలనం

Jun 14 2026 5:29 PM | Updated on Jun 14 2026 5:40 PM

Dhiraj, Kumkum stun Olympic champions South Korea to clinch recurve mixed team gold

ఆర్చరీ వరల్డ్‌కప్‌ స్టేజ్-3లో సంచలనం నమోదైంది. పది సార్లు ఒలింపిక్స్‌ ఛాంపియన్లు అయిన సౌత్‌ కొరియాపై భారత్‌ వరుసగా రెండోసారి విజయం సాధించింది. టర్కీలోని ఆంటాల్యా వేదికగా జరిగిన ఈ టోర్నీలో భారత్‌ రికర్వ్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో స్వర్ణ పతకం కైవసం​ చేసుకుంది. 

ఇవాళ (జూన్‌ 14) జరిగిన ఫైనల్లో భారత జోడీ (బొమ్మదేవర-కుమ్‌కుమ్‌ మోహోద్‌) కొరియా ద్వయం ​కిమ్‌ జే-డియోక్‌, ఓ యే జిన్‌ను 5-1 (37-36, 37-36, 39-39) తేడాతో ఓడించి, గోల్డ్‌ మెడల్‌ను సొంతం చేసుకుంది.

మ్యాచ్‌ మొత్తం భారత ఆటగాళ్లు ఏమాత్రం ఒత్తిడికి లోనుకాకుండా ప్రతి బాణాన్నీ అత్యంత కచ్చితత్వంతో సంధించారు. ముఖ్యంగా 17 ఏళ్ల కుమ్‌కుమ్‌ మోహోద్‌ ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. గత నెలలో జరిగిన షాంఘో వరల్డ్‌కప్‌లోనూ కుమ్‌కుమ్‌.. దీపికా కుమారి, అంకిత భకత్‌తో కలిసి సెమీస్‌లో కొరియాను ఓడించి స్వర్ణం గెలుచుకుంది. తాజాగా అదే జోరు వరల్డ్‌కప్‌ స్టేజ్-3 టోర్నీలోనూ కొనసాగింది. ఈ గెలుపు ఆసియా క్రీడలకు ముందు భారత రికర్వ్‌ జట్టులో విశ్వాసాన్ని మరింత పెరిగింది.

ధిరజ్‌ విషయానికొస్తే.. అతడికి ఇది తొలి వరల్డ్‌కప్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ స్వర్ణం. గతంలో అతను కాంస్య పతకాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం ధిరజ్‌ వ్యక్తిగత ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 16వ స్థానంలో ఉన్నాడు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement