breaking news
Archery World Cup Stage -3 Tournament
-
ప్రపంచకప్‌లో సంచలనం
ఆర్చరీ వరల్డ్‌కప్ స్టేజ్-3లో సంచలనం నమోదైంది. పది సార్లు ఒలింపిక్స్ ఛాంపియన్లు అయిన సౌత్ కొరియాపై భారత్ వరుసగా రెండోసారి విజయం సాధించింది. టర్కీలోని ఆంటాల్యా వేదికగా జరిగిన ఈ టోర్నీలో భారత్ రికర్వ్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. ఇవాళ (జూన్ 14) జరిగిన ఫైనల్లో భారత జోడీ (బొమ్మదేవర-కుమ్కుమ్ మోహోద్) కొరియా ద్వయం కిమ్ జే-డియోక్, ఓ యే జిన్ను 5-1 (37-36, 37-36, 39-39) తేడాతో ఓడించి, గోల్డ్ మెడల్‌ను సొంతం చేసుకుంది.మ్యాచ్ మొత్తం భారత ఆటగాళ్లు ఏమాత్రం ఒత్తిడికి లోనుకాకుండా ప్రతి బాణాన్నీ అత్యంత కచ్చితత్వంతో సంధించారు. ముఖ్యంగా 17 ఏళ్ల కుమ్కుమ్ మోహోద్ ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. గత నెలలో జరిగిన షాంఘో వరల్డ్‌కప్‌లోనూ కుమ్కుమ్.. దీపికా కుమారి, అంకిత భకత్‌తో కలిసి సెమీస్‌లో కొరియాను ఓడించి స్వర్ణం గెలుచుకుంది. తాజాగా అదే జోరు వరల్డ్‌కప్ స్టేజ్-3 టోర్నీలోనూ కొనసాగింది. ఈ గెలుపు ఆసియా క్రీడలకు ముందు భారత రికర్వ్ జట్టులో విశ్వాసాన్ని మరింత పెరిగింది.ధిరజ్ విషయానికొస్తే.. అతడికి ఇది తొలి వరల్డ్‌కప్ మిక్స్డ్ టీమ్ స్వర్ణం. గతంలో అతను కాంస్య పతకాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం ధిరజ్ వ్యక్తిగత ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 16వ స్థానంలో ఉన్నాడు. -
Archery World Cup: మెరిసిన జ్యోతి సురేఖ
పారిస్: ఏడు నెలల విరామం తర్వాత భారత జట్టులోకి పునరాగమనం చేసిన ఆంధ్రప్రదేశ్ మేటి ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ ప్రపంచకప్ స్టేజ్–3 టోర్నీలో మెరిసింది. కాంపౌండ్ వ్యక్తిగత క్వాలిఫయింగ్ రౌండ్లో lవిజయవాడకు చెందిన జ్యోతి సురేఖ 712 పాయింట్లు స్కోరు చేసి రెండో ర్యాంక్‌లో నిలిచింది. భారత్‌కే చెందిన ప్రియా గుర్జర్ 689 పాయింట్లతో 20వ ర్యాంక్‌లో, ముస్కాన్ 689 పాయింట్లతో 21వ ర్యాంక్‌లో, అవనీత్ 686 పాయింట్లతో 24వ ర్యాంక్‌లో నిలిచారు. సురేఖ, ప్రియ, ముస్కాన్‌లతో కూడిన భారత జట్టు టీమ్ విభాగంలో నేరుగా క్వార్టర్ ఫైనల్ ఆడనుంది. -
రన్నరప్ భారత్
వ్రోక్లా (పోలండ్) : ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్-3 టోర్నమెంట్ రికర్వ్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో దీపిక కుమారి-మంగళ్ సింగ్ చాంపియా (భారత్) ద్వయం రజత పతకం సాధించింది. ఆదివారం జరిగిన ఫైనల్లో దీపిక-మంగళ్ సింగ్ జంట 1-5తో ఐదా రోమన్-యువాన్ సెరానో (మెక్సికో) జోడీ చేతిలో ఓడిపోయింది. తొలి సెట్లో రెండు జట్ల స్కోరు 36-36తో సమం కావడంతో ఒక్కో పాయింట్ దక్కింది. ఆ తర్వాత భారత జోడీ రెండో సెట్‌ను 35-37తో, మూడో సెట్‌ను 36-37తో కోల్పోయి ఓటమిని ఖాయం చేసుకుంది.


