CWC 2023: అది వాడిన పిచ్‌.. అయినా సరే! వాళ్లు అద్భుతం: విలియమ్సన్‌

CWC 2023 Ind Vs NZ It Was Used Wicket But Williamson On Pitch Swap Controversy - Sakshi

ICC WC 2023 1st semis- India beat NZ: వన్డే వరల్డ్‌కప్‌-2023 తొలి సెమీ ఫైనల్‌ సందర్భంగా ‘పిచ్‌ మార్పు’పై చెలరేగిన వివాదంపై న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ స్పందించాడు. అది వాడిన పిచ్‌ అని పునర్ఘాటించిన కేన్‌.. తమకు ఈ విషయంలో ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశాడు. ఇప్పటికే వినియోగించిన పిచ్‌ అయినప్పటికీ చాలా బాగుందని కితాబునిచ్చాడు.

కాగా తొలి సెమీస్‌లో టీమిండయా- న్యూజిలాండ్‌ ముంబైలోని వాంఖడే వేదికగా బుధవారం తలపడిన విషయం తెలిసిందే. టాస్‌ గెలిచిన భారత జట్టు తొలుత బ్యాటింగ్‌ చేసింది. శుబ్‌మన్‌ గిల్‌(80-నాటౌట్‌), విరాట్‌ కోహ్లి(117), శ్రేయస్‌ అయ్యర్‌(105) అద్భుత ఇన్నింగ్స్‌తో మెరవగా.. నిర్ణీత 50 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 397 పరుగులు చేసింది.

ఈ క్రమంలో లక్ష్య ఛేదనలో ఆఖరి వరకు పోరాడిన న్యూజిలాండ్‌ 327 పరుగులకు ఆలౌట్‌ అయింది. దీంతో 70 పరుగుల భారీ తేడాతో గెలిచిన టీమిండియా ఫైనల్‌కు దూసుకువెళ్లింది. ఇదిలా ఉంటే.. వాంఖడే పిచ్‌ను ఆఖరి నిమిషంలో మార్చి భారత జట్టుకు అనుకూలం చేశారనే ఆరోపణలు వచ్చాయి.

ఈ విషయంపై స్పందించిన అంతర్జాతీయ క్రికెట్‌ మండలి.. ఇలాంటి టోర్నీల్లో పిచ్‌ మార్పు సర్వసాధారణమని స్పష్టం చేసింది. వాంఖడే క్యూరేటర్‌ సిఫారసు మేరకు.. ఐసీసీ స్వతంత్ర పిచ్‌ సలహాదారుతో సంప్రదించిన తర్వాతే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. 

ఈ క్రమంలో కేన్‌ విలియమ్సన్‌ సైతం ఈ వివాదం నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశాడు.  ‘‘అది ఇది వరకు వాడిన పిచ్‌. కానీ చాలా బాగుంది. మ్యాచ్‌ తొలి అర్ధ భాగంలో టీమిండియా చాలా బాగా బ్యాటింగ్‌ చేసింది. అయినా.. పరిస్థితులకు అనుగుణంగా పిచ్‌ మార్పులు జరుగుతూనే ఉంటాయి.

అందులో మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. భారత జట్టు చాలా బాగా ఆడింది. అయినా ఆఖరి వరకు మేము పోరాడి ఓడిపోయాం. అయితే, మేటి జట్టుకు మాత్రం గట్టి పోటీనివ్వగలిగాం. ప్రపంచంలోనే టీమిండియా అత్యుత్తమ జట్టు. ప్రస్తుతం వాళ్లు ఉత్తమ దశలో ఉన్నారు’’ అని విలియమ్సన్‌ పిచ్ మార్పు వివాదాన్ని కొట్టిపారేశాడు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

16-11-2023
Nov 16, 2023, 15:52 IST
వరల్డ్‌ క్రికెట్‌లో 'చోకర్స్' అంటే మనకు టక్కున దక్షిణాఫ్రికానే గుర్తుకు వస్తుంది. ఎందుకంటే కీలకమైన మ్యాచ్‌‌లలో చేతులెత్తేసే నైజం సౌతాఫ్రికాది....
16-11-2023
Nov 16, 2023, 15:41 IST
ICC WC 2023- Temba Bavuma Batting Failure: వన్డే వరల్డ్‌కప్‌-2023లో సౌతాఫ్రికా కెప్టెన్‌ తెంబా బవుమా బ్యాటింగ్‌ వైఫల్యం...
16-11-2023
Nov 16, 2023, 13:59 IST
ICC Cricket World Cup 2023 - South Africa vs Australia: తొలిసారి వరల్డ్‌కప్‌ ఫైనల్‌ చేరాలనే లక్ష్యంతో సౌతాఫ్రికా.. ఇప్పటికే ఐదుసార్లు...
16-11-2023
Nov 16, 2023, 13:39 IST
వన్డే వరల్డ్‌కప్‌ 2023లో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా ఇవాళ (నవంబర్‌ 16) రెండో సెమీఫైనల్‌ మ్యాచ్‌ జరుగుతుంది. ఈ...
16-11-2023
Nov 16, 2023, 13:07 IST
వన్డే వరల్డ్‌కప్‌ 2023లో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా ఇవాళ (నవంబర్‌ 16) జరగాల్సిన రెండో సెమీఫైనల్‌ మ్యాచ్‌కు...
16-11-2023
Nov 16, 2023, 13:06 IST
ఉత్తరప్రదేశ్‌లోని ఓ కుగ్రామం.. సహాస్‌పూర్‌కు చెందిన తౌసీఫ్‌ అలీ యువకుడిగా ఉన్న సమయంలో ఫాస్ట్‌బౌలర్‌గా గుర్తింపు పొందాడు.. మరి తనకున్న...
16-11-2023
Nov 16, 2023, 12:34 IST
భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య నిన్న జరిగిన వరల్డ్‌కప్‌ 2023 సెమీఫైనల్‌ మ్యాచ్‌కు ఎంతో మంది విశిష్ట అతిథులు హాజరయ్యారు. వారిలో...
16-11-2023
Nov 16, 2023, 12:02 IST
వన్డే వరల్డ్‌కప్‌ 2023లో భాగంగా న్యూజిలాండ్‌తో నిన్న జరిగిన సెమీఫైనల్లో టీమిండియా 70 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ...
16-11-2023
Nov 16, 2023, 10:57 IST
వన్డే వరల్డ్‌కప్‌ 2023లో భాగంగా ముంబై వేదికగా న్యూజిలాండ్‌తో నిన్న (నవంబర్‌ 15) జరిగిన తొలి సెమీఫైనల్లో టీమిండియా 70...
16-11-2023
Nov 16, 2023, 09:42 IST
వన్డే వరల్డ్‌కప్ 2023లో భాగంగా ముంబై వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి సెమీఫైనల్లో టీమిండియా 70 పరుగుల తేడాతో విజయం...
16-11-2023
Nov 16, 2023, 09:08 IST
ముంబై వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి సెమీఫైనల్లో భారత్‌ 70 పరుగుల తేడాతో గెలుపొంది, నాలుగోసారి వరల్డ్‌కప్‌ ఫైనల్‌కు చేరింది....
16-11-2023
Nov 16, 2023, 07:53 IST
క్రికెట్‌లో క్యాచస్‌ విన్‌ మ్యాచస్‌ అనే నానుడు ఉంది. భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య జరిగిన ప్రపంచకప్‌ 2023 తొలి సెమీఫైనల్లో...
15-11-2023
Nov 15, 2023, 23:11 IST
వన్డే వరల్డ్‌కప్‌-2023లో టీమిండియా పేసర్‌ మహ్మద్‌ షమీ మరోసారి అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఈ మెగా టోర్నీలో భాగంగా వాంఖడే...
15-11-2023
Nov 15, 2023, 21:11 IST
వన్డే వరల్డ్‌కప్‌-2023లో భారీ సిక్సర్‌ నమోదైంది. వాంఖడే వేదికగా టీమిండియాతో సెమీఫైనల్లో న్యూజిలాండ్‌ ఆటగాడు డార్లీ మిచెల్‌ ఓ భారీ...
15-11-2023
Nov 15, 2023, 20:53 IST
క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండుల్కర్‌ టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లిపై ప్రశంసలు కురిపించాడు. ఆట పట్ల కోహ్లి నిబద్ధతకు...
15-11-2023
Nov 15, 2023, 19:15 IST
ICC WC 2023- Ind vs NZ- Virat Kohli 50th ODI Century: ‘‘కోల్‌కతాలో కూడా చెప్పాను కదా!.....
15-11-2023
Nov 15, 2023, 19:13 IST
పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజం సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అన్ని ఫార్మట్ల క్రికెట్‌లో పాకిస్తాన్‌ కెప్టెన్సీకి ఆజం రాజీనామా చేశాడు....
15-11-2023
Nov 15, 2023, 19:07 IST
అంతర్జాతీయ క్రికెట్‌లో టీమిండియా స్టార్‌ క్రికెటర్‌, పరుగుల యంత్రం విరాట్‌ కోహ్లి సరికొత్త చరిత్ర లిఖించాడు. వన్డేల్లో అత్యధిక సెంచరీలు...
15-11-2023
Nov 15, 2023, 18:10 IST
టీమిండియా మిడిలార్డర్‌ బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ సరికొత్త చరిత్ర సృష్టించాడు. వన్డే వరల్డ్‌కప్‌ టోర్నీ నాకౌట్‌ మ్యాచ్‌ల్లో ఫాస్టెస్ట్‌ సెంచరీ...
15-11-2023
Nov 15, 2023, 17:09 IST
వన్డే వరల్డ్‌కప్‌-2023లో టీమిండియా స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లి రికార్డుల మోత మోగిస్తున్నాడు. మరో అరుదైన ఘనతను కింగ్‌ కోహ్లి...

మరిన్ని ఫొటోలు 

Read also in:
Back to Top