టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ మాజీ భార్య, కూతురిపై కేసు నమోదు | Case Registered On Indian Cricketer Mohammed Shami Ex Wife Know Reason | Sakshi
Sakshi News home page

టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ మాజీ భార్య, కూతురిపై కేసు నమోదు

Jul 17 2025 12:30 PM | Updated on Jul 17 2025 1:17 PM

Case Registered On Indian Cricketer Mohammed Shami Ex Wife Know Reason

టీమిండియా స్టార్‌ పేసర్‌ మహ్మద్‌ షమీ మాజీ భార్య హసీన్‌ జహా, ఆమె కుమార్తె (మొదటి భర్త ద్వారా కలిగిన సంతానం) అర్షి జహాపై హత్యాయత్నం కేసు నమోదైనట్లు తెలుస్తుంది. వివాదాస్పద స్థలం విషయంలో హసీన్‌, అర్షి తనపై దాడి చేశారని దలియా ఖాతూన్‌ అనే మహిళ పశ్చిమ బెంగాల్‌లోని బిర్భూమ్‌ జిల్లాలో గల సూరి పట్టణ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. 

దీంతో హసీన్‌, అర్షిపై BNSలోని 126(2), 115(2), 117(2), 109, 351(3), 3(5) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. హసీన్‌, అర్షి దలియా ఖాతూన్‌పై దాడి చేస్తున్న దృశ్యాలకు సంబంధించిన వీడియోలు సోషల్‌మీడియాలో వైరలవుతున్నాయి.

పూర్తి వివరాల్లోకి వెళితే.. పశ్చిమ బెంగాల్‌లోని సూరి పట్టణం వార్డ్‌ నంబర్‌ 5లో హసీన్‌ జహా, అమె కుమార్తె అర్షి జహా నివాసముంటున్నారు. ఆ పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో ఇటీవల వారు ఇల్లు నిర్మించడం మొదలుపెట్టారు. ఈ స్థలం అర్షి పేరున రిజిస్టర్‌ అయ్యిందని వారంటున్నారు. 

అయితే ఆ స్థలం తమదని అటు పక్క నివాసముంటున్న దలియా ఖాతూన్‌ ముందుకు వచ్చింది. హసీన్‌ మొదలుపెట్టిన కట్టడాన్ని ఆమె ఆపే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో ఖాతూన్‌పై హసీన్‌, అర్షి దాడికి దిగినట్లు తెలుస్తుంది.

కాగా, షమీకి ఇటీవలే కలకత్తా హైకోర్టు విడాకులు మంజూరు చేసింది. హసీన్‌కు రూ. 4 లక్షల భరణం ఇవ్వాలంటూ షమీని ఆదేశించింది. షమీ ఆర్థిక స్థితిని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు ఈమేరకు తీర్పును వెలువరించింది. ఇందులో హసీన్‌కు రూ. 1.5 లక్షలు, షమీ ద్వారా కలిగిన కూతురు ఐరాకు రూ. 2.5 లక్షలు అని కోర్టు తెలిపింది.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement