తొక్కిసలాట ఘటన.. కర్ణాటక క్రికెట్‌ అసోసియేషన్‌లో ఇద్దరి రాజీనామా | Bengaluru stampede: KSCA secretary & treasurer resign on moral grounds | Sakshi
Sakshi News home page

Bengaluru stampede: తొక్కిసలాట ఘటన.. కర్ణాటక క్రికెట్‌ అసోసియేషన్‌లో ఇద్దరి రాజీనామా

Jun 7 2025 11:29 AM | Updated on Jun 7 2025 11:48 AM

Bengaluru stampede: KSCA secretary & treasurer resign on moral grounds

బెంగ‌ళూరు చిన్న‌స్వామి స్టేడియం వ‌ద్ద జ‌రిగిన తొక్క‌స‌లాట ఘ‌ట‌న‌లో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. ఈ ఘ‌ట‌న‌కు నైతిక బాథ్య‌త వ‌హిస్తూ కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం (KSCA) కార్యదర్శి ఎ. శంకర్, కోశాధికారి ఈఎస్. జైరాం త‌మ పదవులకు రాజీనామా చేశారు. 

వీరిద్ద‌రూ త‌మ రాజీనామాల‌ను శుక్ర‌వారం కేఎస్‌సీఎ అధ్యక్షుడు రఘురామ్ భట్‌కు  సమర్పించారు. "గ‌త రెండు రోజుల‌గా ఊహించని, దుర‌దృష్టకర సంఘటనలు జరిగాయి. ఇందులో మా పాత్ర పరిమితమైనప్పటికీ మేము మా పదవులకు రాజీనామా చేస్తున్నామని" శంకర్‌, జైరాం​ సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు.

దూకుడు పెంచిన పోలీసులు..
కాగా బుధ‌వారం (జూన్ 4) ఆర్సీబీ విజ‌యోత్స‌వ స‌భ‌లోజరిగిన తొక్కిసలాటలో 11మంది మృతిచెందారు. దాదాపు 50 మందికి పైగా గాయపడ్డారు. ఈ తొక్కిసలాట కేసు దర్యాప్తును బెంగ‌ళూరు పోలీసులు వేగవంతం చేశారు.

ఇప్ప‌టికే ఆర్సీబీ మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సోసాలేను అరెస్టు చేశారు. వీరితో పాటు ఈ ఈవెంట్‌ నిర్వాహక సంస్థ డీఎన్ఎ ఎంటర్‌టైన్‌మెంట్ నెట్‌వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన ముగ్గురు సిబ్బందిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement