నల్ల బ్యాండ్‌లతో బరిలోకి దిగిన ఆర్సీబీ, స‌న్‌రైజ‌ర్స్‌ | Why are RCB and SRH players wearing black armbands in todays IPL 2026 match? | Sakshi
Sakshi News home page

IPL 2026: నల్ల బ్యాండ్‌లతో బరిలోకి దిగిన ఆర్సీబీ, స‌న్‌రైజ‌ర్స్‌

Mar 28 2026 7:55 PM | Updated on Mar 28 2026 8:01 PM

Why are RCB and SRH players wearing black armbands in todays IPL 2026 match?

క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూసిన ఐపీఎల్‌-2026 సీజన్‌కు తెరలేచింది. తొలి మ్యాచ్‌లో చిన్నస్వామి స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడతున్నాయి.

ఈ సందర్భంగా గతేడాది చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన 11 మంది అభిమానులకు ఇరు జట్ల ఆటగాళ్లు నివాళులు అర్పించారు. మ్యాచ్ ఆరంభ సమయంలో మైదానంలోకి వెళ్లే ముందు బౌండరీ లైన్ వద్ద రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. 

అదేవిధంగా ఎస్‌ఆర్‌హెచ్‌, ఆర్సీబీ ఆటగాళ్లు నల్ల రిబ్బన్లు ధరించి బరిలోకి దిగారు. మ్యాచ్‌కు ముందు జరిగిన వార్మప్ సెషన్‌లో ఆర్‌సీబీ ఆటగాళ్లందరూ '11' సంఖ్య ఉన్న జెర్సీలను ధరించి ప్రాక్టీస్ చేశారు. కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (KSCA) స్టేడియం ఆవరణలో ఆ అభిమానుల కోసం ఒక ప్రత్యేక స్మారక చిహ్నాన్ని కూడా ఆవిష్కరించింది. 

అంతేకాకుండా వారికి సంతాపంగా స్టేడియంలోని ఒక స్టాండ్‌లో 11 సీట్లను శాశ్వతంగా ఖాళీగా ఉంచారు.  ఈ సీట్లను ఇకపై ఏ ఐపీఎల్ మ్యాచ్‌కు గానీ, అంతర్జాతీయ మ్యాచ్‌కు గానీ విక్రయించరు.  ఇక ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్సీబీ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.
చదవండి: నువ్వు ఫెయిలై పోతావు: అభిషేక్‌ శర్మపై యువీ తండ్రి ఫైర్‌



 

 

Advertisement
 
Advertisement
Advertisement