చరిత్ర సృష్టించిన ఆర్సీబీ.. తొలి జట్టుగా రికార్డు | RCB become first team to play 100 IPL matches in Chinnaswamy Stadium | Sakshi
Sakshi News home page

IPL 2026: చరిత్ర సృష్టించిన ఆర్సీబీ.. తొలి జట్టుగా రికార్డు

Apr 18 2026 5:28 PM | Updated on Apr 18 2026 6:10 PM

RCB become first team to play 100 IPL matches in Chinnaswamy Stadium

ఐపీఎల్‌-2026లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్ బెంగళూరు అరుదైన మైలు రాయిని అందుకుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీకి ఇది వందో మ్యాచ్‌. తద్వారా ఐపీఎల్ చరిత్రలో ఒకే వేదికపై 100 మ్యాచ్‌లు ఆడిన తొలి జట్టుగా బెంగళూరు రికార్డులకెక్కింది. 

ఐపీఎల్‌ తొట్ట తొలి సీజన్‌(2008) ఆర్సీబీ హోం గ్రౌండ్‌గా చిన్నస్వామి స్టేడియం ఉంది. ఇప్పటివరకు ఈ మైదానంలో బెంగళూరు జట్టు  ఇప్పటివరకు 48 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా.. 46 మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. ఓ మ్యాచ్ టై కాగా.. మరో నాలుగు మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దు అయ్యాయి.

ఈ మైదానంలో ఆర్సీబీకి అద్భుతమైన రికార్డు ఉంది. 2013 సీజన్‌లో ఇదే స్టేడియంలో పూణే వారియర్స్‌పై ఆర్సీబీ 263 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇక ఆర్సీబీ తర్వాత స్ధానంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఉంది. కేకేఆర్‌ ఈడెన్‌ గార్డెన్స్‌లో ఇప్పటివరకు 98 మ్యాచ్‌లు ఆడింది.

ఇక ఈ ఏడాది సీజన్‌ విషయానికి వస్తే.. ఆర్సీబీ వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఇప్పటివరకు 5 మ్యాచ్‌లు ఆడిన ఆర్సీబీ నాలుగింట విజయాలు సాధించగా, ఓ మ్యాచ్‌లో ఓటమి పాలైంది. బెంగళూరు జట్టు ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండో స్ధానంలో కొనసాగుతోంది.
చదవండి: IPL 2026: సీఎస్‌కేతో మ్యాచ్‌.. సన్‌రైజర్స్‌ జట్టులోకి యార్కర్ల కింగ్‌?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement