సన్‌రైజర్స్‌ జట్టులోకి యార్కర్ల కింగ్‌? | Predicted SRH playing XI vs CSK: New overseas player to complement Hinge and Sakib | Sakshi
Sakshi News home page

IPL 2026: సీఎస్‌కేతో మ్యాచ్‌.. సన్‌రైజర్స్‌ జట్టులోకి యార్కర్ల కింగ్‌?

Apr 18 2026 1:18 PM | Updated on Apr 18 2026 1:24 PM

Predicted SRH playing XI vs CSK: New overseas player to complement Hinge and Sakib

ఐపీఎల్‌-2026లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ మ‌రో కీల‌క పోరుకు సిద్ద‌మైంది. శ‌నివారం ఉప్ప‌ల్ స్టేడియం వేదిక‌గా చెన్నై సూప‌ర్ కింగ్స్‌తో ఎస్ఆర్‌హెచ్‌ త‌ల‌ప‌డ‌నుంది. గ‌త మ్యాచ్‌లో రాజ‌స్తాన్‌పై ఘ‌న విజ‌యం సాధించిన ఎస్ఆర్‌హెచ్.. ఇప్పుడు అదే జోరును సీఎస్‌కేపై కొన‌సాగించాల‌ని ప‌ట్టుద‌ల‌తో ఉంది.

అయితే ఫిట్‌నెస్ టెస్టు క్లియ‌ర్ చేసి ఎస్ఆర్‌హెచ్ జ‌ట్టుతో క‌లిసిన కెప్టెన్ పాట్ క‌మ్మిన్స్‌.. ఈ మ్యాచ్‌కు మాత్రం అందుబాటులో లేడు. ఏప్రిల్ 25న రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌తో జరిగే మ్యాచ్‌లో క‌మ్మిన్స్ ఆడ‌నున్నాడు.  కాగా సీఎస్‌కేతో మ్యాచ్‌కు ఎస్ఆర్‌హెచ్ తుది జ‌ట్టులో ఓ కీల‌క మార్పు చోటు చేసుకోనున్న‌ట్లు తెలుస్తోంది.

భారీగా ప‌రుగులు స‌మ‌ర్పించుకుంటున్న పేస‌ర్ ఇషాన్ మలింగ‌ను ప‌క్క‌న పెట్టాల‌ని స‌న్‌రైజ‌ర్స్ మేనెజ్‌మెంట్ నిర్ణ‌యించుకున్న‌ట్లు స‌మాచారం. గ‌త సీజ‌న్‌లో త‌న అద్భుత బౌలింగ్‌తో ఆక‌ట్టుకున్న మ‌లింగ.. ప్ర‌స్తుత సీజ‌న్‌లో మాత్రం దారుణంగా విఫ‌ల‌మ‌వుతున్నాడు.

ఇప్ప‌టివ‌ర‌కు 5 మ్యాచ్‌లు ఆడిన మ‌లింగ.. 10.40 ఏకాన‌మీతో ఏకంగా 156 ప‌రుగులు స‌మ‌ర్పించుకున్నాడు. ఈ క్ర‌మంలోనే అతడి స్ధానంలో మ‌రో శ్రీలంక స్పీడ్ స్టార్ దిల్షాన్ మ‌ధుశంక‌కు అవ‌కాశ‌మివ్వాల‌ని ఎస్ఆర్‌హెచ్ భావిస్తుందంట‌. లెఫ్ట్ ఆర్మ్ పేస‌ర్ అయిన మ‌ధుశంక‌కు అద్భుత‌మైన బౌలింగ్ స్కిల్స్ ఉన్నాయి. 

ప‌వ‌ర్‌ప్లేతో పాటు డెత్ ఓవ‌ర్ల‌లో బౌలింగ్ చేసే స‌త్తా కూడా ఉంది. ముఖ్యంగా అత‌డు పిన్ పాయింట్ యార్క‌ర్లు బౌలింగ్ చేయ‌గ‌ల‌డు. మ‌ధుశంక ఇటీవ‌లే బ్రైడ‌న్ కార్స్ స్ధానంలో జ‌ట్టులోకి చేరాడు. గ‌త మ్యాచ్‌లో స‌త్తాచాటిన ప్రఫుల్ హింగే, సాకిబ్ హుస్సేన్‌తో మ‌ధుశంక బంతిని పంచుకునే అవ‌కాశ‌ముంది. ఒక‌వేళ న‌లుగురు పేస‌ర్ల‌తో ఎస్ఆర్‌హెచ్ ఆడాల‌ని భావిస్తే మ‌లింగ‌కు బ‌దులుగా స్పిన్న‌ర్ హ‌ర్ష్ దూబేను ప‌క్క‌న పెట్టే ఛాన్స్ ఉంది.

సీఎస్‌కేతో మ్యాచ్‌కు ఎస్ఆర్‌హెచ్ తుది జట్టు(అంచ‌నా)
ట్రావిస్ హెడ్‌, ఇషాన్ కిష‌న్‌( కెప్టెన్‌), హెన్రిచ్ క్లాసెన్‌, నితీష్ కుమార్ రెడ్డి, అనికేత్ వ‌ర్మ‌, స‌లీల్ అరోరా, హ‌ర్ష్ దూబే, శివంగ్ కుమార్‌, దిల్షాన్ మ‌ధుశంక‌, సాకిబ్ హుస్సేన్, ప్రఫుల్ హింగే(ఇంపాక్ట్ సబ్)
చదవండి: BAN vs PAK: పాక్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం.. ఒకేసారి నలుగురికి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement