PAK vs BAN 1st Test: రావల్పిండి టెస్టు.. తొలి రోజు బంగ్లాదే | BAN Vs PAK 1st Test Day 1: Pakistan 158-4 At Stumps, Check Score Update Details Inside | Sakshi
Sakshi News home page

PAK Vs BAN 1st Test: రావల్పిండి టెస్టు.. తొలి రోజు బంగ్లాదే

Aug 21 2024 8:49 PM | Updated on Aug 22 2024 1:28 PM

BAN vs PAK 1st Test Day 1: Pakistan 158-4 at stumps

రావ‌ల్పిండి వేదిక‌గా పాకిస్తాన్‌తో జ‌రుగుతున్న తొలి టెస్టులో మొద‌టి రోజు బంగ్లాదేశ్ పై చేయి సాధించింది. వ‌ర్షం కార‌ణంగా మొద‌టి రోజు కేవ‌లం 41 ఓవ‌ర్ల ఆట మాత్ర‌మే సాధ్య‌ప‌డింది.

తొలి రోజు ఆట ముగిసే స‌మ‌యానికి ఆతిథ్య పాకిస్తాన్ 4 వికెట్లు కోల్పోయి 158 ప‌రుగులు సాధించింది. క్రీజులో సౌద్ ష‌కీల్‌(57), రిజ్వాన్‌(24) ప‌రుగుల‌తో ఉన్నారు. కాగా టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్‌కు బంగ్లా బౌల‌ర్లు షాకిచ్చారు.

16 ప‌రుగుల‌కే 3 వికెట్లు కోల్పోయి పాక్ క‌ష్టాల్లో ప‌డింది. ఈ స‌మ‌యంలో సైమ్ అయూబ్(56), సౌధ్ ష‌కీల్ పాక్ ఇన్నింగ్స్‌ను చ‌క్క‌దిద్దారు. 

అయూబ్ ఔటైన త‌ర్వాత షకీల్‌, రిజ్వాన్ మ‌రో వికెట్ కోల్పోకుండా ఆచితూచి ఆడారు. బంగ్లా బౌల‌ర్ల‌లో హ‌స‌న్ మ‌హ్మ‌ద్‌, షోర్‌ఫుల్ ఇస్లాం త‌లా రెండు వికెట్లు ప‌డ‌గొట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement