టీ20 క్రికెటర్‌ ఆఫ్ దియర్-2024 నామినీస్ వీరే.. బుమ్రాకు నో ఛాన్స్‌ | Babar, Arshdeep nominated for T20I Player of the Year 2024 | Sakshi
Sakshi News home page

టీ20 క్రికెటర్‌ ఆఫ్ దియర్-2024 నామినీస్ వీరే.. బుమ్రాకు నో ఛాన్స్‌

Dec 29 2024 3:24 PM | Updated on Dec 29 2024 4:13 PM

Babar, Arshdeep nominated for T20I Player of the Year 2024

ఐసీసీ పురుషుల టీ20 క్రికెట్ ఆఫ్ ది ఇయర్-2024కు సంబంధించిన నామినీస్‌ వివరాలను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఆదివారం(డిసెంబర్ 29) ప్రకటించింది. ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డు కోసం మొత్తం నలుగురు ఆటగాళ్లను ఐసీసీ నామినేట్‌ చేసింది.

ఈ జాబితాలో భారత్‌ నుంచి యువ ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్‌కు చోటు దక్కించుకున్నాడు. ఈ ఏడాది టీ20ల్లో అర్ష్‌దీప్‌ సింగ్‌ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ ఏడాది కేవలం 18 టీ20లు మాత్రమే ఆడిన అర్ష్‌దీప్‌ 7.49 ఏకనామీతో 36 వికెట్లు పడగొట్టాడు. టీ20 వరల్డ్‌కప్‌-2024లోనూ అర్షదీప్‌ అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. 

మొత్తం 8 మ్యాచ్‌ల్లో 17 వికెట్లు పడగొట్టి ఈ మెగా ఈవెంట్‌లో లీడింగ్‌ వికెట్‌ టేకర్‌గా నిలిచాడు. ఇక ఈ అవార్డు కోసం అర్ష్‌దీప్‌ సింగ్‌తో పాటు పాకిస్తాన్‌ స్టార్‌ ప్లేయర్‌ బాబర్‌ ఆజం, జింబాబ్వే కెప్టెన్‌ సికిందర్‌ రజా, ఆస్ట్రేలియా విధ్వంసకర వీరుడు ట్రావిస్‌ హెడ్‌ పోటీ పడుతున్నారు.

ఈ ఏడాది టీ20ల్లో బాబర్‌ పర్వాలేదన్పించాడు. 23 ఇన్నింగ్స్‌లో 738 పరుగులతో పాక్‌ తరపున లీడింగ్‌ స్కోరర్‌గా నిలిచాడు. అదే విధంగా  సికిందర్‌ రజా ఈ ఏడాది టీ20 క్రికెట్‌లో ఆల్‌రౌండ్ షోతో అదరగట్టాడు. మొత్తం 23 ఇన్నింగ్స్‌లలో 573 పరుగులతో పాటు 24 కూడా వికెట్లు పడగొట్టాడు. ఇక ట్రావిస్‌ హెడ్‌ విషయానికి వస్తే..  ఈ ఏడాది 15 ఇన్నింగ్స్‌లో 539 పరుగులు చేశాడు.

బుమ్రాకు నో ఛాన్స్‌.. 
కాగా ఈ నామినీస్ జాబితాలో టీమిండియా పేస్ ‍గుర్రం జస్ప్రీత్ బుమ్రా పేరు లేకపోవడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. ఈ ఏడాది జరిగిన టీ20 వరల్డ్‌కప్‌లో బుమ్రా అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ మెగా టోర్నీలో బుమ్రా ఎనిమిది మ్యాచ్‌లలో 4.17 ఎకానమీతో 15 వికెట్లు పడగొట్టి ప్లేయర్‌ ఆఫ్‌ది టోర్నీగా బుమ్రా నిలిచాడు. అయినప్పటికి బుమ్రాను టీ20 క్రికెట్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు నామినేట్‌ చేయకపోవడం గమనార్హం.

Advertisement
 
Advertisement
Advertisement