PC: X
టీమిండియా స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ మరో అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ఒక క్యాలెండర్ ఈయర్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత ప్లేయర్‌గా అర్ష్‌దీప్ చరిత్ర సృష్టించాడు. క్రైస్ట్‌చర్చ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న సెకెండ్ టీ20లో రెండు వికెట్లు పడగొట్టడంతో అర్ష్‌దీప్ ఈ అరుదైన ఫీట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.
ఈ ఏడాది అతడు ఇప్పటివరకు 38 వికెట్లు సాధించాడు. ఇంతకముందు ఈ రికార్డు టీమిండియా వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ పేరిట ఉండేది. 2022లో 32 టీ20 మ్యాచ్‌ల్లో భువీ 37 వికెట్లు పడగొట్టాడు. తాజా మ్యాచ్‌తో అతడి ఆల్‌టైమ్ రికార్డును పంజాబ్ పేసర్ బ్రేక్ చేశాడు. ఓవరాల్‌గా ఈ జాబితాలో ఐర్లాండ్ పేసర్ జోష్ లిటిల్ (2022లో 26 మ్యాచ్‌ల్లో 39 వికెట్లు) టాప్‌లో ఉన్నారు. ఈ రికార్డును బ్రేక్ చేయాలంటే అర్ష్‌దీప్ మరో రెండు వికెట్లు పడగొట్టాలి.
లీడింగ్ వికెట్ టేకర్‌గా
అర్ష్‌దీప్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. టీ20ల్లో భారత్ తరపున లీడింగ్ వికెట్ టేకర్‌గా అతడు కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు 101 టీ20 మ్యాచ్‌లాడిన అర్ష్‌దీప్ 148 వికెట్లు పడగొట్టాడు.
మరో 2 వికెట్లు తీస్తే అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో 150 వికెట్లు సాధించిన తొలి భారత బౌలర్‌గా చరిత్ర సృష్టిస్తాడు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు ఎనిమిది మంది మాత్రమే ఈ ఘనత సాధించారు. వారిలో ఏ ఒక్క భారత్ ప్లేయర్ కూడా లేడు.
చదవండి: AUS vs SA: గెలుపు జోష్‌లో ఉన్న సౌతాఫ్రికాకు భారీ షాక్


