పాక్‌తో రెండో టెస్టు.. ఆసీస్‌ జట్టు ప్రకటన! యువ ఆటగాడు రిలీజ్‌ | Australia name 13 man squad for Boxing Day Test vs Pakistan | Sakshi
Sakshi News home page

AUS vs PAK: పాక్‌తో రెండో టెస్టు.. ఆసీస్‌ జట్టు ప్రకటన! యువ ఆటగాడు రిలీజ్‌

Dec 18 2023 9:00 AM | Updated on Dec 18 2023 9:22 AM

Australia name 13 man squad for Boxing Day Test vs Pakistan - Sakshi

PC: The Guardian

పాకిస్తాన్‌తో బాక్సింగ్ డే టెస్టుకు 13 మంది సభ్యులతో కూడిన తమ జట్టును క్రికెట్‌ ఆస్ట్రేలియా ప్రకటించింది. పేసర్ లాన్స్ మోరిస్‌ను రెండో టెస్టుకు ముందు క్రికెట్‌ ఆస్ట్రేలియా  విడుదల చేసింది. మోరిస్‌ బిగ్‌బాష్‌ లీగ్‌లో పాల్గోనున్నాడు. ఇదొక్కటి మినహా తమ జట్టులో ఆసీస్‌  ఎటువంటి మార్పు చేయలేదు.

డిసెంబర్‌ 26 నుంచి మెల్‌బోర్న్‌ వేదికగా ఇరు జట్ల మధ్య రెండో టెస్టు ప్రారంభం కానుంది. కాగా ఈ సిరీస్‌లో ఇప్పటికే ఆసీస్‌ 1-0 అధిక్యంలోకి దూసుకెళ్లింది. పెర్త్‌ వేదికగా జరిగిన తొలి టెస్టులో పాక్‌ను ఏకంగా 360 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా చిత్తు చేసింది. 450 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్‌.. ఆసీస్‌ బౌలర్ల దాటికి 89 పరుగులకే కుప్పకూలింది.

ఆస్ట్రేలియా జట్టు: పాట్ కమిన్స్ (కెప్టెన్‌), స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, కామెరాన్ గ్రీన్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుషేన్‌, నాథన్ లియోన్, మిచల్‌ మార్ష్, స్టీవ్ స్మిత్, మిచల్‌ స్టార్క్, డేవిడ్ వార్నర్

Advertisement
 
Advertisement
Advertisement