Asia Cup 2023: పసికూనపై ప్రతాపం చూపించిన పాక్‌.. భారీ విజయం | Asia Cup 2023: Pakistan Beat Nepal By 238 Runs - Sakshi
Sakshi News home page

Asia Cup 2023: పసికూనపై ప్రతాపం చూపించిన పాక్‌.. భారీ విజయం

Aug 30 2023 9:32 PM | Updated on Aug 31 2023 9:52 AM

Asia Cup 2023: Pakistan Beat Nepal By 238 Runs - Sakshi

ఆసియా కప్‌ 2023లో భాగంగా ముల్తాన్‌ వేదికగా నేపాల్‌తో ఇవాళ (ఆగస్ట్‌ 30) జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్‌ 238 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన పాక్‌ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 342 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. బాబర్‌ ఆజమ్‌ (131 బంతుల్లో 151; 14 ఫోర్లు, 4 సిక్సర్లు), ఇఫ్తికార్‌ అహ్మద్‌ (71 బంతుల్లో 109 నాటౌట్‌; 11 ఫోర్లు, 4 సిక్సర్లు) శతకాలతో విరుచుకుపడగా.. మహ్మద్‌ రిజ్వాన్‌ (44) పర్వాలేదనిపించాడు.

ఫకర్‌ జమాన్‌ (14), ఇమామ్‌ ఉల్‌ హాక్‌ (5), అఘా సల్మాన్‌ (5) విఫలమయ్యారు. నేపాల్‌ బౌలర్లలో సోంపాల్‌ కామీ 2 వికెట్లు పడగొట్టగా.. కరణ్‌ , సందీప్‌ లామిచ్చేన్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు. ఇమామ్‌ ఉల్‌ హాక్‌, రిజ్వాన్‌ రనౌట్లయ్యారు. 

343 పరుగుల భారీ లక్ష్యాఛేదనకు దిగిన నేపాల్‌.. 23.4 ఓవర్లలో 104 పరుగులకు ఆలౌటైంది. షాదాబ్‌ ఖాన్‌ (4/27) నేపాల్‌ పతనాన్ని శాశించగా.. షాహీన్‌ అఫ్రిది, హరీస్‌ రౌఫ్‌ చెరో 2 వికెట్లు.. నసీం షా, నవాజ్‌ తలో వికెట్‌ పడగొట్టారు. నేపాల్‌ ఇన్నింగ్స్‌లో ఆరిఫ్‌ షేక్‌ (26), సోంపాల్‌ కామీ (28), గుల్సన్‌ షా (13) రెండంకెల స్కోర్లు చేయగా.. మిగతా ఆటగాళ్లంతా సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకే పరిమితమయ్యారు.

Advertisement
 
Advertisement
Advertisement