
పోల్ వాల్ట్‌లో స్వీడన్ అథ్లెట్ అద్భుతం
6.30 మీటర్ల ఎత్తుకు ఎగిరి కొత్త చరిత్ర
వరుసగా మూడోసారి ప్రపంచ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సొంతం
సెర్గీ బుబ్కా తర్వాత ఈ ఘనత సాధించిన
రెండో పోల్ వాల్టర్‌గా గుర్తింపు
ఊహించిన అద్భుతమే జరిగింది. పోల్ వాల్ట్‌లో మరోసారి ప్రపంచ రికార్డు బద్దలయింది. మారింది వేదిక మాత్రమే... ప్రపంచ రికార్డు సృష్టించిన వ్యక్తి మాత్రం మారలేదు... వరల్డ్ రికార్డు నెలకొల్పడం... మళ్లీ దానిని సవరించడం... తన ఖాతాలో పసిడి పతకం వేసుకోవడం... సమీప ప్రత్యర్థులను రెండో స్థానానికే పరిమితం చేయడం... పోల్ వాల్ట్ క్రీడాంశం పేరు చెబితే తనను తప్పనిసరిగా గుర్తు చేసుకునేలా రోజురోజుకూ రాటుదేలుతూ దూసుకుపోతున్న ఆ అథ్లెట్ ఎవరో కాదు... స్వీడన్ స్టార్ అర్మాండో డుప్లాంటిస్... బరిలో దిగితే ప్రపంచ రికార్డుపైనే గురి పెట్టే ఈ సూపర్ స్టార్ పోల్ వాల్టర్ సోమవారం టోక్యోలో మెరిశాడు. కళ్లు చెదిరే ప్రదర్శనతో తన ఖాతాలో 14వ ప్రపంచ రికార్డు వేసుకోవడంతోపాటు... ప్రపంచ చాంపియన్‌షిప్ చరిత్రలో వరుసగా మూడు స్వర్ణాలు సాధించి... ఈ క్రీడాంశంలో దిగ్గజం సెర్గీ బుబ్కా సరసన డుప్లాంటిస్ చేరాడు.
టోక్యో: అథ్లెటిక్స్ అభిమానులందరూ ఆసక్తిగా ఎదురుచూసిన పురుషుల పోల్ వాల్ట్ ఈవెంట్‌లో ప్రపంచ, ఒలింపిక్ చాంపియన్ అర్మాండో డుప్లాంటిస్ అలరించాడు. సోమవారం జరిగిన ఫైనల్లో స్వీడన్‌కు చెందిన 25 ఏళ్ల డుప్లాంటిస్ కొత్త ప్రపంచ రికార్డు సృష్టించడంతోపాటు పసిడి పతకాన్ని కైవసం చేసుకున్నాడు. 6.30 మీటర్ల ఎత్తుకు ఎగిరిన డుప్లాంటిస్ తన కెరీర్‌లో 14వ సారి ప్రపంచ రికార్డును లిఖించాడు. గత నెలలో హంగేరి రాజధాని బుడాపెస్ట్‌లో జరిగిన మీట్‌లో 6.29 మీటర్లతో తానే నెలకొలి్పన ప్రపంచ రికార్డును డుప్లాంటిస్ సవరించాడు. విజేతగా నిలిచిన డుప్లాంటిస్‌కు 70 వేల డాలర్లు (రూ. 61 లక్షల 68 వేలు) ప్రైజ్‌మనీగా, ప్రపంచ రికార్డు సృష్టించినందుకు లక్ష డాలర్లు (రూ. 88 లక్షల 12 వేలు) బోనస్‌గా లభించాయి.
12 మంది పోటీపడ్డ ఫైనల్లో డుప్లాంటిస్ తన ఆరో ప్రయత్నంలో 6.15 మీటర్ల ఎత్తును అధిగమించి స్వర్ణ పతకాన్ని ఖాయం చేసుకున్నాడు. కరాలిస్ (గ్రీస్; 6 మీటర్లు) రజత పతకం నెగ్గగా... కురి్టస్ మార్షల్ (ఆ్రస్టేలియా; 5.95 మీటర్లు) కాంస్య పతకాన్ని దక్కించుకున్నాడు. పసిడి పతకం ఖాయమయ్యాక డుప్లాంటిస్ ప్రపంచ రికార్డుపై గురి పెట్టాడు. తొలి రెండు ప్రయత్నాల్లో 6.30 మీటర్ల ఎత్తును అధిగమించడంలో విఫలమైన డుప్లాంటిస్ మూడో ప్రయత్నంలో సఫలమై ప్రపంచ రికార్డును అందుకున్నాడు. డుప్లాంటిస్ కెరీర్‌లో ఇది వరుసగా 49వ విజయంకాగా... మేజర్ టోరీ్నల్లో ఐదో టైటిల్.
టోక్యో ఒలింపిక్స్, పారిస్ ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకాలు గెలిచిన డుప్లాంటిస్.. 2022 ప్రపంచ చాంపియన్íÙప్‌లో, 2023 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో బంగారు పతకాలు సాధించాడు. తాజా విజయంతో డుప్లాంటిస్ ప్రపంచ చాంపియన్íÙప్‌లో ‘హ్యాట్రిక్’ స్వర్ణాలను సొంతం చేసుకున్నాడు. సెర్గీ బుబ్కా తర్వాత వరుసగా మూడు ప్రపంచ చాంపియన్íÙప్‌లలో బంగారు పతకాలు గెలిచిన రెండో పోల్ వాల్టర్‌గా డుప్లాంటిస్ గుర్తింపు పొందాడు. సెర్గీ బుబ్కా (సోవియట్ యూనియన్/ఉక్రెయిన్) వరుసగా ఆరు ప్రపంచ చాంపియన్íÙప్‌లలో (1983, 1987, 1991, 1993, 1995, 1997) స్వర్ణ పతకాలు సాధించాడు.