రన్నరప్‌గా అనాహత్‌ సింగ్‌ | Sakshi
Sakshi News home page

రన్నరప్‌గా అనాహత్‌ సింగ్‌

Published Tue, Jan 9 2024 8:42 AM

Anahat Finishes Runner Up At 2024 British Junior Open - Sakshi

ప్రతిష్టాత్మక బ్రిటిష్‌ జూనియర్‌ ఓపెన్‌ స్క్వాష్‌ టోర్నమెంట్‌లో భారత రైజింగ్‌ స్టార్‌ అనాహత్‌ సింగ్‌ రన్నరప్‌గా నిలిచింది. బర్మింగ్‌హమ్‌లో జరిగిన ఈ టోర్నీలో ఢిల్లీకి చెందిన 15 ఏళ్ల అనాహత్‌ సింగ్‌ అండర్‌–17 బాలికల సింగిల్స్‌ విభాగంలో రజత పతకం గెలిచింది.

68 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో టాప్‌ సీడ్‌ అనాహత్‌ 11–7, 11–13, 10–12, 11–5, 9–11తో రెండో సీడ్‌ నాదీన్‌ ఎల్‌హమీ (ఈజిప్ట్‌) చేతిలో ఓటమి చవిచూసింది. ఈ టోర్నీ చరిత్రలో అనాహత్‌కిది మూడో పతకం. 2019లో అండర్‌–11 విభాగంలో, 2023లో అండర్‌–15 విభాగంలో అనాహత్‌ స్వర్ణ పతకాలు సాధించింది. 

Advertisement
Advertisement