ఇండియన్ ఓపెన్ స్క్వాష్ టోర్నీ
ఇండోర్: భారత నంబర్‌వన్, రైజింగ్ స్టార్ అనాహత్ సింగ్ ఇండియన్ ఓపెన్ అంతర్జాతీయ స్క్వాష్ టోర్నమెంట్ టైటిల్ కైవసం చేసుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో భారత్‌కే చెందిన వెటరన్ స్టార్ జోష్నా చినప్పపై అనాహత్ విజయం సాధించింది.
హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో ప్రపంచ 33వ ర్యాంకర్ అనాహత్ సింగ్ 3–2 (11–8, 11–13, 11–9, 6–11, 11–9)తో ఒకప్పటి ప్రపంచ టాప్–10 ప్లేయర్ జోష్నా చినప్పపై గెలిచింది. 55 నిమిషాల పాటు సాగిన పోరులో టీనేజ్ స్టార్ అనాహత్ అదరగొట్టింది.
ఎదురుగా ఉన్నది సీనియర్ ప్లేయర్ అయినా ఏమాత్రం ఒత్తిడికి గురికాని అనాహత్ చక్కటి స్ట్రోక్ ప్లేతో ఆకట్టుకుంది. ఐదో గేమ్‌లో 6–6తో స్కోర్లు సమమైన దశలో 39 ఏళ్ల జోష్నా పైచేయి సాధించేందుకు ప్రయత్నించినా... పట్టువిడవని అనాహత్ కెరీర్‌లో 13వ పీఎస్‌ఏ టైటిల్ ఖాతాలో వేసుకుంది.


