టీ20 వరల్డ్‌కప్‌ బెస్ట్‌ టీమ్‌ ఇదే.. కోహ్లి, పంత్‌లకు నో ఛాన్స్‌! | Aakash Chopra Picks T20 World Cup Team of the Tournament | Sakshi
Sakshi News home page

T20 WC: టీ20 వరల్డ్‌కప్‌ బెస్ట్‌ టీమ్‌ ఇదే.. కోహ్లి, పంత్‌లకు నో ఛాన్స్‌!

Jul 3 2024 6:07 PM | Updated on Jul 3 2024 6:51 PM

Aakash Chopra Picks T20 World Cup Team of the Tournament

టీ20 ప్రపంచకప్‌ 2024 ఛాంఫియ‌న్స్‌గా భార‌త్ నిలిచిన విష‌యం విధిత‌మే. బార్బోడ‌స్ వేదిక‌గా జ‌రిగిన‌ ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను ఓడించిన భారత్‌.. 11 ఏళ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీని ముద్దాడింది. ఆఖ‌రి వ‌ర‌కు ఉత్కంఠ భ‌రితంగా సాగిన తుది పోరులో 7 ప‌రుగుల తేడాతో టీమిండియా విజ‌యం సాధించింది. 

దీంతో 140 కోట్ల మంది భార‌తీయ‌ల హృదయాలు విజయ గర్వంతో ఉప్పొంగిపోయాయి. విశ్వవిజేతగా నిలిచిన భారత జట్టు గురువారం ప్రత్యేక విమానంలో బార్బోడస్‌ నుంచి స్వదేశానికి చేరుకోనుంది.

ఇక ఇది ఇలా ఉండగా.. టీ20 వరల్డ్‌కప్‌-2024 ముగియడంతో టీమ్‌ ఆఫ్‌ది టోర్నమెంట్‌ను భారత మాజీ క్రికెటర్‌ ఆకాష్‌ చోప్రా ఎంచుకున్నాడు.

ఈ జట్టులో వరల్డ్‌కప్‌ ఫైనల్‌ హీరోలు విరాట్‌ కోహ్లి, అక్షర్‌ పటేల్‌కు చోప్రా చోటివ్వలేదు. అదే విధంగా భారత వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిషబ్‌ పంత్‌కు సైతం చోటుదక్కలేదు. వీరితో పాటు ఆసీస్‌ స్టార్‌ ఓపెనర్‌ ట్రావిస్‌ హెడ్‌, ప్యాట్‌ కమ్మిన్స్‌కు కూడా చోప్రా ఎంపిక చేయలేదు.

కాగా ఈ జట్టుకు భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మను సారథిగా అతడు ఎంపిక చేశాడు. ఇక చోప్రా తన జట్టులో ఓపెనర్లుగా రోహిత్‌ శర్మ(భారత్‌), రెహ్మతుల్లా గుర్భాజ్‌(అఫ్గానిస్తాన్‌) అవకాశమిచ్చాడు. ఫస్ట్‌డౌన్‌లో నికోలస్‌ పూరన్‌(వెస్టిండీస్‌)కు చోప్రా చోటిచ్చాడు. 

సూర్యకుమార్‌ యాదవ్‌(భారత్‌), హెన్రిచ్‌ క్లాసెన్‌(దక్షిణాఫ్రికా)లకు వరుసగా నాలుగు, ఐదు స్ధానాల్లో చాన్స్‌ దక్కింది. ఆల్‌రౌండర్ల కోటాలో హార్ధిక్‌ పాండ్యా(భారత్‌), రషీద్‌ ఖాన్‌లను అతడు ఎంపిక చేశాడు. ఇక ఫాస్ట్‌ బౌలర్లగా ఫజాలక్‌ ఫరూఖీ(అఫ్గానిస్తాన్‌), జస్ప్రీత్‌ బుమ్రా(భారత్‌), అర్ష్‌దీప్‌ సింగ్‌(భారత్‌)లను చోప్రా ఎంచుకున్నాడు.

ఆకాష్‌ చోప్రా ఎంచుకున్న జట్టు ఇదే
రోహిత్‌ శర్మ(కెప్టెన్‌), గుర్బాజ్‌, నికోలస్‌ పూరన్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, హెన్రిచ్‌ క్లాసెన్‌,  ఫజాలక్‌ ఫరూఖీ,హార్ధిక్‌ పాండ్యా,రషీద్‌ ఖాన్‌,ఫజాలక్‌ ఫరూఖీ,జస్ప్రీత్‌ బుమ్రా,అర్ష్‌దీప్‌ సింగ్‌
 

Advertisement
 
Advertisement
Advertisement