మరికొన్ని గంటల్లో మ్యాచ్‌.. భారత తుది జట్టు ఇదే | Aakash Chopra picks his India playing 11 for IND vs WI 2026 1st T20I, no place for Vaibhav Suryavanshi | Sakshi
Sakshi News home page

IND vs WI: మరికొన్ని గంటల్లో మ్యాచ్‌.. భారత తుది జట్టు ఇదే

Oct 6 2026 12:01 PM | Updated on Oct 6 2026 12:28 PM

Aakash Chopra picks his India playing 11 for IND vs WI 2026 1st T20I, no place for Vaibhav Suryavanshi

PC: BCCI/X

భార‌త్‌-వెస్టిండీస్ మ‌ధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు స‌మ‌యం ఆసన్నమైంది. ఈ సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ మంగ‌ళ‌వారం ల‌క్నోలోని ఏకానా స్టేడియం వేదిక‌గా జ‌ర‌గ‌నుంది. ఈ క్ర‌మంలో తొలి టీ20 కోసం టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా తన భారత ప్లేయింగ్ ఎలెవ‌న్‌ను ప్ర‌కటించాడు. యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీని పక్కనబెట్టి, అభిషేక్ శర్మకు జోడీగా సంజూ శాంసన్‌ను అత‌డు ఎంపిక చేశాడు.

ఇటీవ‌ల ముగిసిన ఆసియా క్రీడ‌ల్లో శాంసన్, సూర్యవంశీ ఇద్దరూ తుది జట్టులో ఆడినప్పటికీ, విండీస్‌తో మ్యాచ్‌కు మాత్రం వీరిద్దరిలో ఒకరికే చోటు ద‌క్కుతుంద‌ని అత‌డు అభిప్రాయ‌ప‌డ్డాడు. కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌‌ర్‌, హెడ్ కోచ్ గౌత‌మ్ గంభీర్ తరహాలోనే చోప్రా కూడా సంజూ వైపే మొగ్గు చూపాడు.

ఆకాశ్ చోప్రా ఎంపిక చేసిన జట్టులో బ్యాటింగ్ ఆర్డర్‌లో మూడు, నాలుగు స్ధానాల్లో వ‌రుస‌గా ఇషాన్ కిష‌న్‌, కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్‌కు అవ‌కాశ‌మిచ్చాడు. ఐదో స్ధానంలో తిల‌క్ వ‌ర్మ‌కు ఛాన్స్ దక్కింది. ఆల్‌రౌండ‌ర్ల కోటాలో శివమ్ దూబే, నితీశ్ కుమార్ రెడ్డి, అక్ష‌ర్ ప‌టేల్‌కు చోటు లభించింది.

మ్యాచ్ పరిస్థితిని బట్టి దూబే, నితీశ్‌ బ్యాటింగ్ ఆర్డర్‌ను మార్చుకోవచ్చని చోప్రా పేర్కొన్నాడు. స్పెష‌లిస్ట్ స్పిన్న‌ర్‌గా కుల్‌దీప్ యాద‌వ్‌ను ఎంపిక చేయగా, ఫాస్ట్ బౌల‌ర్లుగా అర్ష్‌దీప్ సింగ్‌, మ‌యాంక్ యాద‌వ్‌ల‌కు అవ‌కాశ‌మిచ్చాడు.

చోప్రా ఎంపిక చేసిన ప్లేయింగ్‌ ఎలెవన్‌ ఇదే
అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్, తిలక్ వర్మ, శివమ్ దూబే, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, మయాంక్ యాదవ్
చదవండి: హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ సంచ‌ల‌న నిర్ణ‌యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement