
వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL) 2025 టోర్నీలో దక్షిణాఫ్రికా ఛాంపియన్స్ హ్రాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. గురువారం లీసెస్టర్ వేదికగా ఇంగ్లండ్ ఛాంపియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో సౌతాఫ్రికా గెలుపొందింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసింది. ఇంగ్లీష్ జట్టు బ్యాటర్లలో ఫిల్ మస్టర్డ్(39) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. సౌతాఫ్రికా బౌలర్లలో తహిర్, పార్నల్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.
ఏబీడీ మెరుపు శతకం
అనంతరం లక్ష్య చేధనలో సౌతాఫ్రికా ఛాంపియన్స్ కెప్టెన్ ఏబీ డివిలియర్స్ విధ్వంసం సృష్టించాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన ఏబీడీ.. ప్రత్యర్ధి బౌలర్లను ఊతికారేశాడు. లీసెస్టర్ మైదానంలో బౌండరీల వర్షం కురిపించాడు. ఈ క్రమంలో కేవలం 41 బంతుల్లోనే తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.
ఓవరాల్‌గా 51 బంతుల్లో 116 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్ 15 ఫోర్లు, 7 సిక్స్‌లు ఉన్నాయి. మరో ఎండ్‌లో హాషీమ్ అమ్లా 25 బంతుల్లో 29 పరుగులు చేసి ఏబీడీకి సపోర్ట్‌గా ఉన్నాడు. డివిలియర్స్ తుపాన్ ఇన్నింగ్స్ ఫలితంగా.. సౌతాఫ్రికా వికెట్ కోల్పోకుండా 153 పరుగుల లక్ష్యాన్ని12.2 ఓవర్లలోనే చేధించింది.
అంతకుముందు భారత్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ మిస్టర్ 360 అద్బుతమైన హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 41 ఏళ్ల వయస్సులోనూ డివిలియర్స్ బ్యాటింగ్ చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.
చదవండి: IND vs ENG: అప్పుడు కుంబ్లే.. ఇప్పుడు పంత్!
41-year-old 🤝 41-ball century #WCL2025 #ABD #ABDeVilliers pic.twitter.com/fviC9HK8Tl
— FanCode (@FanCode) July 24, 2025