PC: BCCI/X
సెప్టెంబర్ నెలకు గానూ 'ప్లేయర్ ఆఫ్‌ది మంత్' అవార్డుకు నామినేట్ అయిన ఆటగాళ్ల జాబితాను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తాజాగా ప్రకటించింది. ఈ అవార్డు కోసం ముగ్గురు ఆటగాళ్లను ఐసీసీ షార్ట్‌లిస్ట్ చేసింది. ఈ లిస్ట్‌లో భారత టీ20 కెప్టెన్ శుబ్‌మన్ గిల్, స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మలతో పాటు జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా చోటు దక్కించుకున్నారు.
అభిషేక్ శర్మ విషయానికి వస్తే.. జింబాబ్వే పర్యటనలో విఫలమైనప్పటికీ, స్వదేశంలో అఫ్గానిస్థాన్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. మొత్తం మూడు మ్యాచ్‌లలో 229 పరుగులు చేసి లీడింగ్ రన్‌స్కోరర్‌గా నిలిచాడు. ఏషియన్ గేమ్స్‌లోనూ ఈ పంజాబ్ క్రికెటర్ సత్తాచాటాడు.
ఇక శుబ్‌మన్ గిల్ సొంతగడ్డపై విండీస్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో సత్తాచాటాడు. తొలి వన్డేలో సెంచరీ బాదిన గిల్.. రెండో వన్డేలో ఏకంగా డబుల్ సెంచరీ సాధించి భారత్‌కు సిరీజ్ విజయాన్ని అందించాడు. రజా కూడా ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో ఆకట్టుకున్నాడు.
3 మ్యాచ్‌ల్లో 91.50 యావరేజ్‌తో 183 రన్స్ చేయడమే కాకుండా 3 వికెట్లు పడగొట్టి ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాడు. మహిళల కేటగిరీలో డాషింగ్ ఓపెనర్ షెఫాలీ వర్మ, యువ స్పిన్నర్ శ్రీచరణి నామినేట్ అయ్యారు. మహిళల ఆసియా కప్, ఆసియా క్రీడల్లో వారిద్దరూ అదరగొట్టారు. ఓవరాల్‌గా మెన్స్, ఉమెన్స్ కలిపి మొత్తం నలుగురు భారత ప్లేయర్లు ఈ ప్రతిష్టాత్మక అవార్డ్‌కు షార్ట్ లిస్ట్ అయ్యారు.


