
2025వ సంవత్సరాన్ని క్రికెట్ అభిమానులు అంత ఈజీగా మరచిపోలేరు. ఎందుంటే ఈ ఏడాది ఒకరు కాదు ఇద్దరు కాదు 20 మందికి పైగా స్టార్ క్రికెటర్లు ఆటకు వీడ్కోలు (Retirement) పలికారు. ఈ విషయం సగటు క్రికెట్ అభిమానికి తీవ్ర శోకాన్ని కలిగిస్తుంది. తమ ఆరాధ్య ఆటగాళ్లు ఇకపై అంతర్జాతీయ వేదికపై ఆడరని తెలిసి అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు.
ఈ ఏడాది న్యూజిలాండ్ విధ్వంసకర బ్యాటర్ మార్టిన్ గప్తిల్‌తో రిటైర్మెంట్ల పరంపర మొదలైంది. మధ్యలో భారత దిగ్గజాలు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ టెస్ట్‌లకు వీడ్కోలు పలికారు. తాజాగా ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ క్రిస్ వోక్స్ ఆట మొత్తానికి అల్విదా చెప్పాడు. ఈ మధ్యలో కొందరు కొన్ని ఫార్మాట్లకు మరికొందరు అంతర్జాతీయ కెరీర్ మొత్తానికి గుడ్‌బై చెప్పారు.
ఈ ఏడాది రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ ఆటగాళ్లపై ఓ లుక్కేద్దాం..
మార్టిన్ గుప్తిల్ (అన్ని ఫార్మాట్లు)
వరుణ్ ఆరోన్ (అన్ని ఫార్మాట్లు)
తమీమ్ ఇక్బాల్ (అన్ని ఫార్మాట్లు)
వృద్దిమాన్ సాహా (అన్ని ఫార్మాట్లు)
షకీబ్ అల్ హసన్ (టెస్ట్)
కేన్ విలియమ్సన్ (టీ20)
షాపూర్ జద్రాన్ (అన్ని ఫార్మాట్లు)
మహ్మదుల్లా (అన్ని ఫార్మాట్లు)
దిముత్ కరుణరత్నే (అన్ని ఫార్మాట్లు)
విరాట్ కోహ్లి (టెస్ట్)
రోహిత్ శర్మ (టెస్ట్)
మార్కస్ స్టోయినిస్ (వన్డే)
స్టీవ్ స్మిత్ (వన్డే)
గ్లెన్ మ్యాక్స్‌వెల్ (వన్డే)
హెన్రిచ్ క్లాసెన్ (అన్ని ఫార్మాట్లు)
ముష్ఫికర్ రహీం (వన్డే)
నికోలస్ పూరన్ (అన్ని ఫార్మాట్లు)
ఆండ్రీ రసెల్ (అన్ని ఫార్మాట్లు)
ఏంజెలో మాథ్యూస్ (టెస్ట్)
పియూశ్ చావ్లా (అన్ని ఫార్మాట్లు)
అమిత్ మిశ్రా(అన్ని ఫార్మాట్లు)
చతేశ్వర్ పుజారా (అన్ని ఫార్మాట్లు)
మిచెల్ స్టార్క్ (టీ20)
క్రిస్ వోక్స్ (అన్ని ఫార్మాట్లు)
చదవండి: స్టార్ క్రికెటర్ రిటైర్మెంట్