
మొన్నటివరకు ప్రతీ క్రికెటర్ తమ దేశానికి ప్రాతినిథ్యం వహించాలని కలలు కనేవారు. ఒక్కసారి తమ జాతీయ జట్టుకు ఆడితే చాలు అని పరితపించేవారు. కానీ ఇప్పుడు మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది.చాలా మంది ఆటగాళ్లు ప్రాంఛైజీ క్రికెట్ మోజులో పడి తమ అంతర్జాతీయ కెరీర్‌ను ఆర్ధాంతంగా ముగిస్తున్నారు.
దక్షిణాఫ్రికా ఆటగాడు హెన్రిస్ క్లాసెన్, విండీస్ స్టార్ ప్లేయర్ నికోలస్ పూరన్ ఈ కోవకు చెందిన వారే. మరికొంతమంది క్రికెటర్లు ఆ దేశ క్రికెట్ బోర్డు కాంట్రాక్ట్‌లను సైతం వదులుకున్నారు. ఒకప్పడు ఫిట్‌నెస్ సమస్యల కారణంగానే, వ్యక్తిగత కారణాల చేతో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికేవారు.

మరింత కాలం దేశానికి తమ సేవలు అందించాలన్న తపన ఉన్నప్పటికి, అవకాశాలు రాకపోవడంతో చాలా మంది క్రికెటర్లు తమ కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఈ క్రమంలో 30 ఏళ్ల తిరగకముందే రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్లపై ఓ లుక్కేద్దాం.
నికోలస్ పూరన్
వెస్టిండీస్ స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ నికోలస్ పూరన్ 29 ఏళ్ల వయస్సులో అంతర్జాతీయ క్రికెట్ వీడ్కోలు పలికి అందరికి షాకిచ్చాడు. విండీస్ కెప్టెన్‌గా, వికెట్ కీపర్ బ్యాటర్‌గా సేవలు అందించిన పూరన్.. ఈ నిర్ణయం తీసుకుంటాడని ఎవరూ ఊహించలేదు.
తన రిటైర్మెంట్ ప్రకటించిన మరుసటి రోజే అమెరికా మేజర్ టీ20 లీగ్‌లో ముంబై న్యూయర్క్ జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. దీనిబట్టి ఆర్ధం చేసుకోవచ్చు పూరన్ రిటైర్మెంట్ వెనక అసలు కారణమేంటో. 2016లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన పూరన్.. విండీస్ తరఫున 106 టీ20లు, 61 వన్డేలు ఆడాడు.
టీ20 స్పెషలిస్ట్‌గా పేరొందిన పూరన్ ఈ ఫార్మాట్‌లో 136.4 స్ట్రయిక్‌రేట్‌తో 13 హాఫ్ సెంచరీల సాయంతో 2275 పరుగులు చేశాడు. వన్డేల్లో 3 సెంచరీలు, 11 హాఫ్ సెంచరీల సాయంతో 1983 పరుగులు చేశాడు.
ఉన్ముక్త్ చంద్..
2012లో U-19 జట్టును ప్రపంచ కప్‌కు నడిపించిన తర్వాత భారతదేశం యొక్క తదుపరి గొప్ప విషయంగా ప్రశంసించబడిన ఉన్ముక్త్ చంద్, 28 సంవత్సరాల వయసులో ఆ జట్టుకు రాజీనామా చేశాడు. తరువాత అతను కొత్త క్రికెట్ ప్రయాణం మరియు భారత దేశీయ సర్క్యూట్‌లకు మించి కొత్త అవకాశాలను అన్వేషించడానికి USకి తన స్థావరాన్ని మార్చుకున్నాడు.
క్రెయిగ్ కీస్‌వెట్టర్
ఇంగ్లండ్ 2010 టీ20 ప్రపంచకప్ విన్నర్, వికెట్ కీపర్ బ్యాటర్ క్రెయిగ్ కీస్‌వెట్టర్ 27 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. కంటికి తగిలిన గాయం కారణంగా అతడు ఇంటర్ననేషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 2010 టీ20 ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియాపై కీస్‌వెట్టర్(63) అద్బుతమైన హాఫ్ సెంచరీ సాధించాడు.
మునాఫ్ పటేల్
2011 వరల్డ్‌కప్ విజయం తర్వాత భారత పేసర్ మునాఫ్ పటేల్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అప్పటికి అతడు వయస్సు 28 ఏళ్లు మాత్రమే. భారత్ వరల్డ్‌కప్‌ను సొంతం చేసుకోవడంలో మునాఫ్‌ది కీలక పాత్ర. వన్డేల్లో అతడు 86 వికెట్లు పడగొట్టాడు.
జేమ్స్ టేలర్
ఇంగ్లండ్ జట్టులో కీలక ఆటగాడిగా ఎదుగుతున్న సమయంలో జేమ్స్ టేలర్‌ను దురదృష్టం వెంటాడింది. 26 ఏళ్ల వయస్సులో టేలర్ గుండె సంబంధిత సమస్యలు కారణంగా అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలిగేటప్పటికి వన్డేల్లో అతడి సగటు 42పైగా ఉంది.
ఆకిబ్ జావేద్
పాకిస్తాన్ టాలెంటడ్ పేసర్ ఆకిబ్ జావేద్ మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో 26 ఏళ్ల వయస్సులోనే అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరయ్యాడు. వన్డేల్లో అతడిపేరిట 182 వికెట్లు ఉన్నాయి. స్టార్ బౌలర్‌గా కొనసాగుతున్న సమయంలో అతడు అనూహ్య రిటైర్మెంట్ ప్రకటించడం అందరిని ఆశ్చర్యపరిచింది.
హెన్రీ ఒలోంగా
జింబాబ్వే తొలి నల్లజాతి క్రికెటర్ హెన్రీ ఒలోంగా కేవలం 26 ఏళ్ల వయస్సులోనే అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నాడు. 2003 ప్రపంచ కప్ సందర్భంగా దేశ పాలనకు వ్యతిరేకంగా ఈ నిర్ణయాన్ని ఒలోంగా తీసుకున్నాడు.
సక్లైన్ ముష్తాక్
పాకిస్తాన్ అత్యుత్తమ ఆఫ్ స్పిన్నర్లలో ఒకరిగా నిలిచిన సక్లైన్ ముష్తాక్.. 27 ఏళ్ల వయస్సులోనే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. తొమ్మిదేళ్ల పాటు పాక్‌కు ప్రాతినిథ్యం వహించిన ముష్తాక్..496 అంతర్జాతీయ వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.
టటెండా తైబు..
టటెండా తైబు.. జింబాబ్వే క్రికెట్ చరిత్రలో తన పేరును సువర్ణక్షరాలతో లిఖించుకున్నాడు. ఈ జింబాబ్వే మాజీ కెప్టెన్ 29 ఏళ్ల వయసులో చర్చి పనిని కొనసాగించడానికి అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నాడు.