రేషన్‌ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ | - | Sakshi
Sakshi News home page

రేషన్‌ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ

Aug 17 2026 7:17 AM | Updated on Aug 17 2026 7:17 AM

ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట): రేషన్‌ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. జిల్లా కేంద్రంలో లబ్ధిదారులకు స్మార్ట్‌ రేషన్‌ కార్డులను లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇప్పటికే రాష్ట్రంలో 16లక్షల రేషన్‌ కార్డులు పంపిణీ చేశామని, ప్రతి రేషన్‌ కార్డులో ఒక్కొక్కరికి 6కిలోల చొప్పున సన్నబియ్యం అందిస్తున్నామన్నారు. వికలాంగులు, వితంతు, ఒంటరి మహిళలు, తదితరుల నూతన పెన్షన్‌కు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 2.5 లక్షల కొత్త పెన్షన్లు మంజూరు చేయనున్నామన్నారు. కార్యక్రమంలో కలెక్టర్‌ హైమవతి, అదనపు కలెక్టర్‌ లక్ష్మీ కిరణ్‌ , పద్మశాలి ఫెడరేషన్‌ చైర్మన్‌ గూడూరి శ్రీనివాస్‌, లైబ్రరీ చైర్మన్‌ దరిపల్లి చంద్రం , ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ బక్కి వెంకయ్య, ఆర్టీఏ మెంబర్‌ సూర్య వర్మ , మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ లు, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement