సమాజాభివృద్ధికి కృషి: కలెక్టర్‌ | - | Sakshi
Sakshi News home page

సమాజాభివృద్ధికి కృషి: కలెక్టర్‌

Aug 17 2026 7:17 AM | Updated on Aug 17 2026 7:17 AM

సిద్దిపేటరూరల్‌: ఎంతోమంది త్యాగధనుల కృషి ఫలితమే నేటి స్వాతంత్య్ర దినోత్సవమని, వారిని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ సమాజాభివృద్ధికి కృషి చేయాలని కలెక్టర్‌ హైమావతి అన్నారు. శనివారం 80వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని కలెక్టరేట్‌ ప్రాంగణంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ నాటి త్యాగదనులందరినీ గుర్తు చేసుకుంటూ వారి మార్గంలో నడుస్తూ సమాజ అభివృద్ధికి పాటుపడాలన్నారు. అంతకు ముందు పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ లక్ష్మీకిరణ్‌, జిల్లా రెవెన్యూ అధికారి నాగరాజమ్మ, జిల్లా అధికారులు, వివిధ శాఖల అధికారులు , కలెక్టరేట్‌ సిబ్బంది, పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement