రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌లో ప్రతిభ | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌లో ప్రతిభ

Jul 20 2026 7:35 AM | Updated on Jul 20 2026 7:35 AM

బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శిగా నవీన్‌గౌడ్‌ అర్హుల ఒక్క ఓటు మిస్‌ కావొద్దు: జగ్గారెడ్డి

సిద్దిపేటజోన్‌: మెదక్‌ ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించిన జరిగిన రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌ పోటీల్లో సిద్దిపేట జిల్లా క్రీడాకారులు ప్రతిభ కనబర్చారు. అండర్‌18 విభాగం బాలికల 1500 మీటర్ల పరుగు పందెంలో వైష్ణవి వెండి పతకం, అండర్‌ 20 బాలుర 5 కిలోమీటర్ల పరుగు పందెంలో యస్వంత్‌ వెండి పతకం, అండర్‌ 16 విభాగం కిలోమీటర్‌ పరుగు పందెంలో విష్ణు కాంస్య పతకం, అండర్‌ 20 విభాగం 800 మీటర్ల పరుగు పందెంలో హరి కాంస్య పతకం, అండర్‌ 18 విభాగంలో1500 మీటర్ల పరుగు పందెంలో అభిరామ్‌ కాంస్య పతకం సాధించారు. ఈ సందర్భంగా జిల్లా క్రీడలశాఖ అధికారి వీరారెడ్డి, అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు పరమేశ్వర్‌, కార్యదర్శి వెంకట్‌ స్వామి వారిని అభినందించారు.

ఎన్జీవో భవన్‌ అధ్యక్ష,

కార్యదర్శుల ఎన్నిక

సిద్దిపేటజోన్‌: జిల్లా కేంద్రంలోని ప్రముఖ పబ్లిక్‌ సర్వెంట్స్‌ హోం(ఎన్జీవో భవన్‌) నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా సాదుల నాగభూషణం, ప్రధాన కార్యదర్శిగా గ్యాదరి పరమేశ్వర్‌, ఆర్థిక కార్యదర్శిగా శ్రీనివాస్‌, ఉపాధ్యక్షులుగా పోచయ్య, రాజేందర్‌, సంయుక్త కార్యదర్శులుగా మధుసూదన్‌, శ్రీనివాస రాజు, ఆడిట్‌ మెంబర్లుగా రామ్మోహన్‌, శ్రీనివాస్‌, కార్యవర్గ సభ్యులుగా రాంరెడ్డి, రవీందర్‌ రెడ్డి, కృష్ణ, గణేశ్‌, ఉపేందర్‌ గౌడ్‌ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ... సేవా కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టనున్నట్టు పేర్కొన్నారు. ఎన్జీవో భవన్‌ పేరు ప్రఖ్యాతులను మరింత ఇనుమడింప చేస్తామని తెలిపారు. నాలుగు సంఘాల ప్రతినిధులకు వారు కృతజ్ఞతలు తెలియజేశారు.

పటాన్‌చెరు టౌన్‌: బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శిగా ఇస్నాపూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని రుద్రారానికి చెందిన నవీన్‌గౌడ్‌ నియమితులయ్యారు. ఈమేరకు ఆదివారం హైదరాబాద్‌లోని బీసీ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్‌. కృష్ణయ్య చేతుల మీదుగా నియామకపత్రం అందజేశారు. ఈసందర్భంగా నవీన్‌గౌడ్‌ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల పక్షాన ఉద్యమాన్ని మరింత బలోపేతం చేసే విధంగా తన వంతుగా కృషి చేస్తానన్నారు. జిల్లాలో అన్ని కమిటీలు వేసి సంఘాన్ని మరింత బలోపేతం చేస్తానన్నారు. తన నియామకానికి సహకరించిన జాతీయ కో ఆర్డినేటర్‌ అరుణ్‌ కుమార్‌, జిల్లా నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

సంగారెడ్డి: నియోజకవర్గంలో అర్హులైన ఏ ఒక్కరి ఓటు మిస్‌ కాకుండా కాంగ్రెస్‌ బీఎల్‌ఏలు, నాయకులు జాగ్రత్తలు తీసుకోవాలని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి సూచించారు. గత నెల రోజులుగా అమలవుతున్న సర్‌ ప్రక్రియపై ఆదివారం పట్టణంలోని ఓ గార్డెన్‌లో పార్టీ జిల్లా అధ్యక్షురాలు నిర్మలారెడ్డితో కలిసి ముఖ్య నాయకులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని 282 బీఎల్‌ఏలతో ఒక్కొక్కరితో జగ్గారెడ్డి ముఖాముఖిగా మాట్లాడారు. ఇప్పటికి ఎన్ని ఫారాలు పంపిణీ చేశారు, ఇచ్చిన ఫారాల్లో ఎన్ని తిరిగి వచ్చాయి, ఇంకా ఎన్ని రావాల్సి ఉంది అని అడిగి తెలుసుకున్నారు. నియోజకవర్గంలో ఇప్పటివరకు 66.67% ఓటరు నమోదు పూర్తయిందని, గడువులోగా మొత్తం ప్రక్రియ పూర్తి కావాలని ఆదేశించారు. మూడు రోజుల తర్వాత మరోసారి సమీక్ష నిర్వహిస్తానని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నియోజకవర్గ కన్వీనర్‌ చేర్యాల ఆంజనేయులు, టీపీసీసీ ప్రధా న కార్యదర్శి తోపాజి అనంత్‌ కిషన్‌, నాయకులు కూన సంతోష్‌, కిరణ్‌గౌడ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement