పార్ట్‌ టైం లెక్చరర్ల నియామకానికి దరఖాస్తులు | - | Sakshi
Sakshi News home page

పార్ట్‌ టైం లెక్చరర్ల నియామకానికి దరఖాస్తులు

Jul 19 2026 6:47 AM | Updated on Jul 19 2026 6:47 AM

హుస్నాబాద్‌రూరల్‌: జిల్లాలో ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీలో ఖాళీల భర్తీకి పార్ట్‌ టైం లెక్చరర్ల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ శ్రీదేవి శనివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. 12 లెక్చరర్‌ పోస్టులు మంజూరయ్యాయని, వీటి కోసం అర్హుల నుంచి ఈ నెల 20 నుంచి 22 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు చెప్పారు. సివిల్‌ ఇంజనీరింగ్‌–4, కంప్యూటర్‌ ఇంజనీరింగ్‌–2, ఈఈఈ–3తోపాటు, గణితం–1, భౌతికశాస్త్రం–1, రసాయనశాస్త్రం–1 పోస్టులున్నాయని, ఆసక్తిగల అభ్యర్థులు ఈ నెల 20 నుంచి 22 వరకు హుస్నాబాద్‌ ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ నెల 24న సర్టిఫికెట్లు పరిశీలించి ఉదయం 10 గంటలకు డెమో, ఇంటర్వ్యూలు నిర్వహిస్తామన్నారు. ఏఐసీటీఈ నిర్దేశించిన అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.

ప్రిన్సిపాల్‌ పి.శ్రీదేవి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement