26న కొమురవెల్లి రైల్వేస్టేషన్‌ ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

26న కొమురవెల్లి రైల్వేస్టేషన్‌ ప్రారంభం

Jul 19 2026 6:47 AM | Updated on Jul 19 2026 6:47 AM

కొమురవెల్లి(సిద్దిపేట): ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురవెల్లి మల్లికార్జున స్వామి దర్శనానికి వచ్చే భక్తుల చిరకాల స్వప్నం నెరవేరనుంది. సుమారు రూ.5కోట్లతో నిర్మించిన కొమురవెల్లి రైల్వేస్టేషన్‌ ప్రారంభానికి సిద్ధమైంది. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, మధ్యప్రదేశ్‌ సీఎం మోహన్‌యాదవ్‌తో కలసి 2024 ఫిబ్రవరి 15న శంకుస్థాపన చేసిన ఈ రైల్వేస్టేషన్‌ పనులు పూర్తయ్యాయి. ఈనెల 26 కిషన్‌రెడ్డి చేతుల మీదు గా ప్రారంభించనున్నారు. దీంతో హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని ఇతరప్రాంతాల నుంచి కొమురవెల్లి మల్లికార్జునస్వామి దర్శనానికి వచ్చే భక్తులకు ప్రయాణం మరింత సౌకర్యవంతగా మారనుంది. ఇప్పటికే సికింద్రాబాద్‌ నుంచి సిద్దిపేటకు ప్రతీ రోజు రెండు రైళ్లు రైల్వేశాఖ నడిపిస్తుంది. సిద్దిపేట నుంచి కొత్తపల్లి వరకు రైల్వే పనులు కొనసాగుతున్నాయి. పనులు పూర్తయితే సికింద్రాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌ ప్రాంతాలనుంచి కొమురవెల్లికి వచ్చే భక్తులకు ప్రయాణం మరింత సులభం కా నుంది. భక్తుల రద్దీ, ప్రయాణికుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో రైళ్ల సంఖ్యను పెంచే అంశాన్ని కూడా రైల్వేశాఖ పరిశీలించనుంది.

కోడ్‌ కేటాయింపు

కొమురవెల్లి రైల్వేస్టేషన్‌కు భారతీయ రైల్వేశాఖ కేఐపీకే 0943 6626 అనే కోడ్‌ కేటాయించింది. దీంతో రైల్వే టికెట్‌ బుకింగ్‌, ప్రయాణికుల సమాచార సేవలతో పాటు రైల్వే కార్యకలాపాల్లో కొమురవెల్లి రైల్వేస్టేషన్‌కు గుర్తింపు లభించింది. కోడ్‌ కేటాయించడంతో రైల్వేస్టేషన్‌ ప్రారంభానికి మార్గం సులువైంది. కొమురవెల్లి రైల్వేస్టేషన్‌ ప్రారంభమైతే రోడ్డుమార్గంతోపాటు రైలుమార్గంలో సులువుగా చేరుకునే అవకాశమేర్పడుతుంది.

● ప్రారంభించనున్నకేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

● తప్పనున్న మల్లన్న భక్తుల తిప్పలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement