‘ప్రగతి ప్రణాళిక’ పక్కాగా చేపట్టాలి | - | Sakshi
Sakshi News home page

‘ప్రగతి ప్రణాళిక’ పక్కాగా చేపట్టాలి

Mar 15 2026 6:45 AM | Updated on Mar 15 2026 6:45 AM

నంగునూరు(సిద్దిపేట): ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామాల్లో చేపట్టిన 99 రోజుల ప్రణాళికను పక్కాగా నిర్వహించాలని కలెక్టర్‌ హైమా వతి ఆదేశించారు. శనివారం నర్మేటలోని పల్లె ప్రకృతి వన నర్సరీ, కస్తూర్బా గాంధీ పాఠశాలను తనఖీ చేశారు. ఈసందర్భంగా నర్సరీలో పెంచుతున్న మునగ, గన్నెరు, కానుగ, తంగేడు మొక్కలను పరిశీలించారు. మునగ కాయలను హాస్టళ్లకు అందజేయాలన్నారు. రోడ్ల వెంట కానుగ మొక్కలను నాటడం ద్వారా వేసవిలో రోడ్ల వెంట చల్లదనం నెలకొంటుందన్నారు. అనంతరం హాస్టల్‌ను సందర్శించి మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. మెనూ పాటించడంతో పాటు ఆహారాన్ని రుచికరంగా వండాలని నిర్వాహకులను ఆదేశించారు.

పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్తు తప్పనిసరి

పదో తరగతి పరీక్షా కేంద్రాల వద్ద మాస్‌ కాపీయింగ్‌ జరగకుండా గట్టి బందోబస్తు నిర్వహించాలని కలెక్టర్‌ హైమావతి పోలీసులను ఆదేశించారు. రాజగోపాల్‌పేల పరీక్షా కేంద్రాన్ని శనివారం కలెక్టర్‌ తనఖీ చేశారు. విద్యార్థులకు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా చర్యలు చేపట్టాలన్నారు. పరీక్ష గదిలో చార్టులు, ఉండకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు చేయాలన్నారు.

కలెక్టర్‌ హైమావతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement