అందరికీ శుభాలు కలగాలి | - | Sakshi
Sakshi News home page

అందరికీ శుభాలు కలగాలి

Mar 20 2026 10:04 AM | Updated on Mar 20 2026 10:04 AM

మంత్రి పొన్నం ప్రభాకర్‌

హుస్నాబాద్‌: ఉగాది పర్వదినాన ప్రజలందరికీ శుభాలు కలగాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఆకాంక్షించారు. గురువారం ఉగాది పండుగ వేళ ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయం, పట్టణంలోని కాశీ మరకత లింగేశ్వర ఆలయం వద్ద ఉగాది పంచాంగ శ్రవణ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ శివపార్వతుల ఆశీర్వాదం అందరిపై ఉంటుందన్నారు. ఎలాంటి ఆటంకం లేకుండా అభివృద్ధి, ప్రజల సంక్షేమం జరగాలన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రతిపక్ష నాయకులు కూడా అభివృద్ధికి సహకరించాలని, గ్రామాలను అభివృద్ధి చేసుకుందామన్నారు. అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ దండి లక్ష్మి, వైస్‌ చైర్‌పర్సన్‌ చిత్తారి పద్మ, కమిషనర్‌ మల్లికార్జున్‌, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement