ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): ప్రజలందరూ సుఖ సంతోషాలతో, అష్ట ఐశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, భగవంతుని ఆశీస్సులు అందరిపై ఉండాలని మనసార కోరుకున్నట్లు మంత్రి వివేక్ తెలిపారు. గురువారం ఉగాది పర్వదిన వేడుకలు జిల్లా కేంద్రంలోని నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అందరికీ అందాలని, మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేసేలా కాంగ్రెస్ ప్రభుత్వానికి బలాన్ని ఇవ్వాలని దేవుడిని వేడుకున్నానన్నారు. కార్యక్రమంలో హరికృష్ణ, అత్తు ఇమామ్, బొమ్మల యాదగిరి, కలీముద్దీన్ అహ్మద్, ఎల్లం యాదవ్ తదితరులు పాల్గొన్నారు.


