మిల్లులో ఒడ్లను మర ఆడిస్తున్న దృశ్యం
ప్రభుత్వం సేకరించిన ఒడ్లను మిల్లుల ద్వారా బియ్యంగా మార్చి వాటిని పేదలకు పంపిణీ చేసేందుకు ఉద్దేశించిన సీఎంఆర్ ప్రక్రియ అభాసుపాలవుతోంది. ఈ సీఎంఆర్‌ను కొందరు రైస్‌మిల్లర్లు అక్రమ సంపాదనకు మార్గంగా మార్చుకుని ప్రభుత్వానికి అప్పగించాల్సిన బియ్యాన్ని గుట్టుగా పక్కదారి పట్టించి కోట్లు దండుకుంటున్నారు. అయితే జిల్లాలోని పలు రైస్‌మిల్లుల్లో అధికారులు ఇటీవల చేపట్టిన తనిఖీల్లో ఈ అక్రమార్కుల గుట్టు రట్టైంది. దీంతో వారిపై చర్యలు తీసుకునేందుకు పౌరసరఫరాల శాఖ అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు.
ఒత్తిడి చేస్తేనే చెల్లింపులు
జిల్లాలో 2023–24 సంవత్సరం సైతం దాదాపు 11 రైస్ మిల్లులకు నోటీసులు జారీ చేశారు. వారిపై అధికారులు ఒత్తిడి తెచ్చి, ధాన్యం అందించాలని అధికారులు హుకుం జారీ చేయడంతో బకాయిగా ఉన్న బియ్యాన్ని అప్పగించారు. ఇలా చేయడంతోనే ఆ ఏడాదికి చెందిన బియ్యంను త్వరగా అందించారు. 2024–25కు సంబంధించిన ధాన్యాన్ని సైతం అందించాలని అధికారులు ఒత్తిడి పెంచనున్నారు.
రూ.10 కోట్ల విలువ చేసే ధాన్యం మాయం
2024–25కిగాను 5వేల
మెట్రిక్ టన్నుల ధాన్యం పెండింగ్
రెండురోజుల్లో నోటీసులు జారీ
గతంలో ఒత్తిడి పెంచితేనే
బకాయిల చెల్లింపు


