రోడ్డు ప్రమాదంలో దంపతుల మృతి
కొండపాక(గజ్వేల్): రోడ్డు పమ్రాదంలో దంపతులు మృతి చెందారు. ఈ ఘటన కొండపాక శివారులో శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. వివరాలు ఇలా... రాజీవ్ రహదారిపై మరమ్మతులు జరుగుతుండటంతో ఒక్కవైపు రోడ్డు బంద్ చేశారు. దీంతో మరొక లైన్‌లో సిద్దిపేటకు, హైదరాబాద్ వైపునకు వాహనాలు వెళ్లేలా ఏర్పాటు చేశారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన మహమ్మద్ అబ్దుల్ రఫీ(50) బెల్లంపల్లి ఏరియాలోని ఖైరీగూడ ఓపెన్ కాస్ట్ సింగరేణి కంపెనీలో జనరల్ అసిస్టెంట్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. ఆయన భార్య ఫర్‌జానతో కలిసి కారులో హైదరాబాద్‌కు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో కొండపాక శివారులో రాజీవ్ రహదారిపై సిద్దిపేట నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న ట్రాలీ ఆటో, కారును ఢీకొట్టింది. దీంతో డ్రైవింగ్ చేస్తున్న రఫీ కారులో ఇరుక్కుపోయి మృతి చెందగా భార్యకు తీవ్ర గాయాలయ్యియి. ఆమెను అంబులెన్సులో సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. కారులో ఇరుక్కుపోయి మృతి చెందిన రఫీని గడ్డపారతో డోర్లను ఓపెన్ చేసి బయటకు తీశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు కుకునూరుపల్లి ఎస్సై శ్రీనివాస్ పేర్కొన్నారు.
కారును ఢీకొట్టిన ట్రాలీ ఆటో
రోడ్డు ప్రమాదంలో దంపతుల మృతి


