గౌరవెల్లి, గండిపెల్లికి నిధులు కేటాయించండి
సీఎంకు చాడ వెంకట్‌రెడ్డి లేఖ
హుస్నాబాద్: గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టుల పూర్తికి సరిపడా నిధులు కేటాయించాలని సీఎం రేవంత్‌రెడ్డికి గురువారం సీపీఐ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్‌రెడ్డి లేఖ రాశారు. గతంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ప్రభుత్వాలు భూ సేకరణ చేయడానికి, ప్రాజెక్టుల నిర్మాణానికి విడతల వారీ గా అరకొర నిధులు కేటాయించడంతో అవి పూర్తి కాలేదని లేఖలో పేర్కొన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టుకు సంబంధించి పర్యావరణ అనుమతులు, న్యాయపరమైన చిక్కులులాంటి వాటిపై మంత్రులు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాక ర్‌లు అధికారుల సమీక్ష చేసి ప్రాజెక్టు పనుల పురోగతిపై ముందడుగు వేయ డం శుభసూచికమన్నారు. కానీ గండిపల్లి రిజర్వాయర్ ప్రస్తావన లేకపోవడం బాధాకరంగా ఉందన్నారు. గండిపల్లి రిజర్వాయర్ పూర్తి చేయడానికి ప్రత్యేకంగా రూ.100 కోట్లు నిధులు మంజూరు చేసి యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని లేఖలో పేర్కొన్నారు.


