మద్యం వ్యాపారులకు బంపర్‌ ఆఫర్‌ | - | Sakshi
Sakshi News home page

మద్యం వ్యాపారులకు బంపర్‌ ఆఫర్‌

Sep 2 2023 6:12 AM | Updated on Sep 2 2023 8:34 PM

- - Sakshi

మద్యం వ్యాపారులకు బంపర్‌ ఆఫర్‌ ఇచ్చింది. గతంలో ఎన్నడూ లేని విధంగా క్రెడిట్‌ రూపంలో మద్యం సరఫరా చేశారు.

సాక్షి, సిద్దిపేట: రాష్ట్ర బెవరేజెస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (టీఎస్‌బీసీఎల్‌).. మద్యం వ్యాపారులకు బంపర్‌ ఆఫర్‌ ఇచ్చింది. గతంలో ఎన్నడూ లేని విధంగా క్రెడిట్‌ రూపంలో మద్యం సరఫరా చేశారు. ఇదివరకు ఎంత చలానా చెల్లిస్తే అంతమొత్తం మద్యం డిపో నుంచి అందించేవారు. పోస్ట్‌ పెయిడ్‌ చెక్కులతో సరుకు తీసుకెళ్లారు. సిద్దిపేటలోని డిపో లో గురువారం అర్ధరాత్రి వరకు బిల్లింగ్‌ చేశారు. ఒక్కరోజే రూ14.14కోట్ల మద్యం అందించారు.

వారం రోజుల్లో రూ. 36.23కోట్ల మద్యం
గత నెల 25 నుంచి 31వ తేదీ వరకు చలానా ద్వారా రూ22.09కోట్ల మద్యం లిఫ్ట్‌ అయ్యింది. 25న రూ.3.73 కోట్లు, 26న రూ.2.98 కోట్లు, 27న సెలవు, 28న రూ.6.52కోట్లు, 29న రూ.2.95 కోట్లు, 30న రూ.5.91కోట్లు, 31న రూ.2.96కోట్లు మద్యం డిపో నుంచి వ్యాపారులు స్టాక్‌ను కొనుగోలు చేశారు. అదే క్రెడిట్‌ ఇవ్వడంతో ఒక్కరోజే 14.14కోట్లు స్టాక్‌ను వ్యాపారులు తీసుకెళ్లారు. చలానా, పోస్ట్‌ పెయిడ్‌ చెక్కులతో కలిపి వారం రోజుల్లో రూ.36.23కోట్ల మద్యం లిఫ్ట్‌ చేయడం గమనార్హం. ఎకై ్సజ్‌ శాఖ నిర్ణయించిన తేదీలోగా క్రెడిట్‌పై తీసుకున్న మద్యం డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.

Advertisement
 
Advertisement
Advertisement