స్పందించిన ఆర్టీసీ అధికారులు
సిద్దిపేటకమాన్: సిద్దిపేట ఆర్టీసీ అధికారులు బస్టాండ్ షాపింగ్ కాంప్లెక్స్‌లోని గదుల అద్దైపె విచారణ చేపట్టారు. ‘సాక్షి’ కథనానికి ఆర్టీసీ అధికారులు స్పందించారు. బస్టాండ్ షాపింగ్ కాంప్లెక్స్‌లో గదుల అద్దె దందాపై ‘రికార్డులో ఒకరు.. షాపులో మరొకరు’ పేరుతో ‘సాక్షి’లో మంగళవారం కథనం ప్రచురితమైంది. ఈ కథనం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కథనానికి ఆర్టీసీ అధికారులు స్పందించి విచారణ జరిపి దుకాణానికి ఏర్పాటు చేసిన టూలెట్ ఫ్లెక్సీని మంగళవారం తొలగించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ డిపో సీఐ కనకలక్ష్మి మాట్లాడుతూ నిబంధనలకు అనుగుణంగా దుకాణాలను నిర్వహించాలని, విరుద్దంగా నిర్వహించినా, షాపులు ఎవరికై నా అద్దెకు ఇచ్చినా విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు.
సిద్దిపేటజోన్: జిల్లా కేంద్రంలోని స్వచ్ఛబడిని మంగళవారం ట్రైనీ ఐఏఎస్ అధికారులు సందర్శించారు. యూపీఎస్‌సీకి ఎంపికై న ఏడుగురు అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. కోమటిచెరువు, స్వచ్ఛబడి, అభయ జ్యోతి మానసిక కేంద్రం తదితర ప్రాంతాల్లో పర్యటించారు. తడి పొడి చెత్త ద్వారా ఆదాయ వనరుల, పునర్వినియోగం, కోమటి చెరువు సుందరీకరణ తదితర అంశాలపై అరా తీశారు. కార్యక్రమంలో ట్రైనీ ఐఏఎస్ అధికారులు భాగ్యశ్రీ, ఆదిత్య తివారీ, తుషాల్, శావేజ్, అభిషేక్, హిమాన్స్ ఉన్నారు.


