కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర | - | Sakshi
Sakshi News home page

కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర

Oct 27 2026 8:22 AM | Updated on Oct 27 2026 8:22 AM

● దళారులకు ధాన్యం విక్రయించి మోసపోవద్దు

● మంత్రి పొన్నం ప్రభాకర్‌

హుస్నాబాద్‌: రైతులు పండించిన ధాన్యం, పత్తిని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర లభిస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. సోమవారం హుస్నాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌ యార్డులో ధాన్యం, పత్తి కొనుగోలు కేంద్రాలను మంత్రి ప్రారంభించారు. అనంతరం మంత్రి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. హుస్నాబాద్‌ నియోజకవర్గంలో 136 కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. ఉత్పత్తులను దళారులకు విక్రయించి మోసపోవద్దని కోరారు. సన్న ధాన్యానికి బోనస్‌ రైతుల ఖాతాలో జమ చేసే బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు.

28న అఖిల పక్ష సమావేశం..

ఎల్‌నినో ప్రభావంపై ఈ నెల 28న అన్ని రాజకీయ పార్టీలతో అఖిల పక్ష సమావేశం నిర్వహించనున్నట్లు మంత్రి వెల్లడించారు. తాగునీరు, విద్యుత్‌, వ్యవసాయ రంగాలకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తామన్నారు. హుస్నాబాద్‌లోనూ అన్ని రాజకీయ పార్టీలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కోనేందుకు అవసరమైన కార్యచరణ పై చర్చిస్తామని తెలిపారు. సమావేశంలో ఆర్డీఓ రామ్మూర్తి, మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ దండి లక్ష్మి, వైస్‌ చైర్‌ పర్సన్‌ చిత్తారి పద్మ, మార్కెట్‌ కమిటి చైర్మన్లు తిరుపతి రెడ్డి, సుధాకర్‌, కౌన్సిలర్లు, సర్పంచ్‌లు, రైతులు పాల్గొన్నారు.

లోక కల్యాణం కోసమే చండీయాగం

లోక కల్యాణం కోసం, ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితుల్లో ప్రజలకు ఇబ్బందులు రాకుండా చూడాలని చండీయాగం నిర్వహించినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. సోమవారం హుస్నాబాద్‌ పట్టణంలోని ఎల్లమ్మ దేవాలయంలో 18వ చండీయాగంలో మంత్రి పాల్గొని పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ ప్రతి పౌర్ణమి రోజున హుస్నాబాద్‌లోని రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో మహా చండీయాగం, ప్రతి అమావాస్య రోజున కొత్తకొండలోని భద్రకాళీ సమేత వీరభద్రస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గ్రామ దేవతల ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలంతా ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కూడా నాగార్జునసాగర్‌లో పూజలు చేశారని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement