మద్దూరు(హుప్నాబాద్): ప్రతి పేదవాడి సొంతింటి కల కాంగ్రెస్ ప్రభుత్వంలోనే సాధ్యమవుతుందని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. సోమవారం దూల్మిట్ట మండలం జాలపల్లిలోని డబుల్‌బెడ్రూం ఇళ్ల పట్టాలను కలెక్టర్ హైమావతితో కలిసి ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వం అందించే సంక్షేమ ఫలాలు అందుతాయని అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ల ఫోరం స్టేట్ వర్కిగ్ ప్రెసిడెంట్ చెట్కూరి కమాలకర్‌యావద్, మాజీ జెడ్పీటీసీ గిరి కొండల్‌రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బండి శ్రీనివాస్‌గౌడ్, సర్పంచ్‌లు కరుణాకర్, కొమ్ము రవి పాల్గొన్నారు.
ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి


